‘రాక్షసుడు2’పై దర్శకుడు భారీ ప్రకటన: సినిమాలో స్టార్ హీరో అంటూ పోస్టర్ రిలీజ్
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. వీటిలో చాలా వరకూ ప్రేక్షకుల మెప్పును పొందుతున్నాయి. ఫలితంగా ఎన్నో చిత్రాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. ఇలా రెండేళ్ల క్రితం వచ్చి ఘన విజయాన్ని అందుకున్న చిత్రం 'రాక్షసుడు'. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా భారీ సక్సెస్‌ను అందుకుంది. సైకో థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీ కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఇది విడుదలై నేటికి (ఆగస్టు 2) రెండు సంవత్సాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నుంచి అదిరిపోయే ప్రకటన వచ్చింది.
రమేష్ వర్మ 'రాక్షసుడు' చిత్రానికి సీక్వెల్ తీస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మొదటి భాగం వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా 'రాక్షసుడు2'కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అంతేకాదు, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై దర్శకుడు రమేష్ వర్మ ట్విట్టర్‌లో 'రాక్షసుడు సినిమా విడుదలై రెండేళ్లు పూర్తైన సందర్భంగా రాక్షసుడు2 పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతుందని వెల్లడిస్తున్నాం. అంతేకాదు, ఈ చిత్రంలో టాప్ స్టార్ నటించబోతున్నారు' అంటూ పోస్ట్ చేశారు. అలాగే, తెలుగు, ఇంగ్లీష్‌లో ఉన్న రెండు పోస్టర్లను విడుదల చేశారు.

ఇక, ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'రాక్షసుడు2' చిత్రాన్ని హవీష్ ప్రొడక్షన్స్‌పై కోనేరు నాగేశ్వర్రావు నిర్మిస్తున్నారు. దీనికి గిబ్రాన్ సంగీతం అందించనున్నాడు. ఇక, ఈ సినిమాను దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల్లో లండన్‌లో ప్రారంభం కాబోతుందట. మొదటి భాగంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. మరి 'రాక్షసుడు2'లో ఎవరు హీరోయిన్‌గా ఉంటారన్నది మాత్రం తెలియలేదు. ఇందులో నటించే వారందరి వివరాలు అతి త్వరలోనే వెల్లడించనున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం రమేష్ వర్మ.. మాస్ మహారాజా రవితేజతో 'ఖిలాడీ' అనే సినిమాను చేస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కూడా సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ పెన్మెశ్చ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది. ఇది పూర్తి కాకముందే ఆయన మరో సినిమాను లైన్‌లో పెట్టుకున్నారు. దీంతో ఈ దర్శకుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











