Sapta Sagaralu Dhaati: సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ "సైడ్ బి" - అన్ని భాషల్లోనూ ఆరోజే విడుదల!
గతంలో ఏ భాషలోనైనా మంచి సినిమా వచ్చిందంటే చాలు... సబ్ టైటిల్స్ పెట్టుకొని మరీ చాలా మంది చూసేవాళ్లు. భాష రాకపోయినా చూస్తే భావం అర్థం అవుతుందని కూడా కొంత మంది సినిమాలను వీక్షించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎంత చిన్న సినిమా అయినా సరే హిట్ టాక్ వచ్చిందంటే వేరే భాషలోకి డబ్ చేసేస్తున్నారు. సినిమా విడుదలకు ముందుగానే మంచి బజ్ క్రియేట్ అయితే పాన్ ఇండియా చిత్రాలను చేసేస్తున్నారు. ఇలా అద్భుతమైన చిత్రాలను అందరికీ అందించేందుకు బాగానే కష్టపడుతున్నారు.
అయితే ఇటీవల కన్నడలో సూపర్ డూపర్ హిట్టుగా నిలిచిన సప్త సాగదాచే ఎల్లో - సైడ్ ఎ గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్టు కాగా వెంటనే తెలుగులోకి డబ్ చేసేశారు. సప్త సాగరాలు దాటి అనే టైటిల్ తో సినిమాను విడుదల చేయగా.. తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. టాలీవుడ్ లో కూడా ఈ సినిమా పెద్ద ఎత్తున వసూళ్లు సాధించింది. అందంమైన జీవితాన్ని గడుపుతున్న ఓ సాదాసీదా అబ్బాయి డబ్బుల కోసం జైలుకు వెళ్లడం, అక్కడే ఇరుక్కుపోవం మనం ఈ కథలో చూడొచ్చు. అలాగే ప్రేమించిన అబ్బాయి కోసం.. అమ్మా పడే తాపత్రయం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది.
ఇంతటి అందమైన చిత్రానికి పార్ట్ 2 కూడా ఉందని అందరికీ తెలిసిందే పార్ట్ 1 సగం వరకే ఉండడం.. హీరో జైలు నుంచి రాకపోవడం చూసిన మనం.. పార్ట్ 2 లో మొత్తం కథను చూసేయచ్చు. అయితే ఈ పార్ట్ 2 కోసం కేవలం కన్నడ ప్రజలు మాత్రమే కాకుండా అన్ని భాషల ప్రజలు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న చిత్రబృందం పార్ట్ 2 ను త్వరలోనే రిలీజ్ చేయబోతుంది. ఒక్క కన్నడ భాషలోనే కాదులెండి మొత్తం నాలుగు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
నిజానికి సప్త సాగర దాచే ఎల్లో - సైడ్ బి సినిమాను అక్టోబర్ 20వ తేదీన అంటే ఈరోజు విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు. అక్టోబర్ 20వ తేదీన కన్నడలో, ఇదే నెల 27వ తేదీన తెలుగులో ఈ సినిమా వస్తుందని ఇండస్ట్రీలో టాక్ నడిచింది. అయితే తాజాగా చిత్రబృందం ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 17వ తేదీన సినిమాను థియేటర్లలోకి తీసుకు రాబోతున్నట్లు చెప్పింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నట్లు రక్షిత్ శెట్టి ఇన్ స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు.

ఈ సినిమా వస్తుందని తెలుసుకున్న ప్రేక్షకులు.. తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు పార్ట్ 2 చూసి ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్.. రక్షిత్ శెట్టి సరసన హీరోయిన్ గా నటించింది. అయితే పార్ట్ బిలో చైత్ర జే ఆచార్ కూడా హీరోయిన్ గా కనిపించబోతుంద. పరమ్యాహ్ స్యూడియేస్ ఈ సినిమాను ప్తరిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. చరణ్ రాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











