కరోనా గుట్టు విప్పేందుకు రెడీ.. ఆకట్టుకునేందుకు వస్తోన్న‘పలాస’ హీరో

ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది కరోనా గురించే. ఎలా పుట్టింది? విరుగుడు ఏంటి? అనే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతే కాకుండా ఈ వైరస్‌ను చైనాయే ప్రపంచం మీదికి వదిలిందనే ఓ వాదన కూడా ఉంది. ఈ క్రమంలో కరోనా వైరస్‌పై సినిమా తీసేందుకు దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆర్జీవీ అయితే లాక్ డౌన్‌లోనే కరోనా వైరస్ సినిమాను తెరకెక్కించేశాడనుకోండి అది వేరే విషయం.

పలాస 1978 చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రక్షిత్. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కు WHO (World Hazard Ordinance) అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. కరోనా వైరస్ వెనక ఎలాంటి కుట్ర జరిగిందనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.హ్యాకింగ్ బ్యాక్ డ్రాప్ లో సైంటిఫిక్ థ్రిల్లర్ గా రానున్న ఈ మూవీని సుధాస్ మీడియా సమర్పణలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో నిర్మించబోతుంది.

Rakshith In WHO World Hazard Ordinance

హీరో రక్షిత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన లుక్‌కి మంచి స్పందన లభిస్తుంది. "I'm gonna tell god everything" వంటి వైవిధ్యమైన హాలీవుడ్ షార్ట్ ఫిలింతో విమర్శకుల ప్రశంసలు తో పాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన దేవ్ పిన్నమరాజు ఈ కథతో దర్శకుడి గా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ను అమెరికా, ఇటలీ, సౌత్ ఆఫ్రికా, ఇండియా-చైనా బార్డర్ లో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X