జీవితం ముందు అవన్నీ చిన్నవే.. రష్మికతో బ్రేకప్ విషయంపై రక్షిత్
రష్మిక మందాన్న అంటే తెలుగువారందరికీ పరిచయమే. ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ కొట్టిన రష్మిక.. ఆపై వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. గీతగోవిందం అంటూ విజయ్ దేవరకొండతో చేసిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించడంతో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. మళ్లీ అదే హీరోతో చేసిన డియర్ కామ్రేడ్ అంతగా కలిసి రాకపోయినా.. అవకాశాలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు. అయితే సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా రష్మికకు చేదు అనుభవమే ఎదురైంది.

హీరోతో ప్రేమ, నిశ్చితార్థం..
‘కిరిక్ పార్టీ' అనే కన్నడ సినిమాలో రష్మిక, రక్షిత్ శెట్టి కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. అంతేకాకుండా వీరిద్దరికీ 2017లో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2018లో వీరిద్దరూ విడిపోయారు.

ఇద్దరూ బిజీగానే..
వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ చేదు అనుభవాలు వారి కెరీర్‌కు ఏ మాత్రం అడ్డురాలేదు. ఇద్దరూ తమ పనుల్లో తలమునకలై ఉన్నారు. అటు రక్షిత్ తన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండగా.. ఇటు రష్మిక క్షణం తీరిక లేకుండా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే వీరిద్దరి బ్రేకప్ విషయం మళ్లీ చర్చల్లోకి వచ్చింది.

ప్యాన్ ఇండియా లెవెల్‌లో రక్షిత్
కన్నడ ఇండస్ట్రీ నుంచి రాబోతోన్న మరో ప్యాన్ ఇండియన్ మూవీ అతడే శ్రీమన్నారాయణ. ఈ చిత్రంలో రక్షిత్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్, సాంగ్స్ కూడా ప్రామిసింగ్‌గా ఉండటంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరో కేజీఎఫ్ అయ్యే అవకాశాలున్నాయని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

ప్రమోషన్‌లో భాగంగా..
అతడే శ్రీమన్నారాయణ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న రక్షిత్‌కు.. మీపై బ్రేకప్ ఏదైనా ప్రభావం చూపించిందా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాదానంగా చెబుతూ.. మన ఈ జీవితం ఎన్నో రకాల అనుభవాలను పరిచయం చేస్తుందని, అయితే అందులో కొన్ని అవి మంచి అనుభవాలై ఉండొచ్చు. అలాగే మరికొన్నిసార్లు చెడ్డ అనుభవాలై ఉండొచ్చని వేధాంత ధోరణిలో మాట్లాడాడు. ప్రతి అనుభవాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగిపోవాల్సిందేనని, ఎందుకంటే ఇవన్నీ మన జీవితం ముందు చాలా చిన్న విషయాలేనని ఓ సూక్తిని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











