యువ నటిపై మానభంగం.. రక్త చరిత్ర విలన్‌పై రేప్ కేసు.. పరారీలో టెంపర్ యాక్టర్
తెలుగు సినిమా రంగంలో విలన్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న నటుడు ఎజాజ్ ఖాన్‌పై మరో వివాదంలో ఇరుక్కొన్నారు. ఇప్పటికే పలు మార్లు డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లిన ఆయన ఇటీవల ఉల్లు అడల్డ్ షో ద్వారా వివాదంలో కూరుకుపోయారు. అంబోలి పోలీసులు ఆయననకు నోటీసులు జారీ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యాక్టర్‌పై ఓ నటి ఫిర్యాదుతో తాజాగా రేప్ కేస్ కూడా నమోదైంది. ఈ కేసు నమోదు తర్వాత ఎవరికి అందుబాటులో లేకుండా కనిపించకుండా వెళ్లిపోయారు. ఎజాజ్ ఖాన్ వివాదాలు, తాజా కేసు వివరాల్లోకి వెళితే..
ఎజాజ్ ఖాన్ సినిమా జీవితం వివరాల్లోకి వెళితే.. పాత్ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అంతగా గుర్తింపు లభించలేదు. తెలుగులో రక్త చరిత్ర 2 సినిమా ద్వారా తెలుగులోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత దూకుడు, బుడ్డా హోగా తేరా బాప్, నాయక్, బాద్షా, హార్ట్ ఎటాక్, వేట, టెంపర్ లాంటి సినిమాల్లో నటించాడు.

గతంలో ఎజాజ్ ఖాన్ డ్రగ్స్ కేసులో ముంబైలో అరెస్ట్ అయ్యాడు. 2018 సంవత్సరంలో డ్రగ్స్ వినియోగం, సప్లై తదితర ఆరోపణలతో ముంబై నార్కోటిక్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు. ఆ సమయంలో సుమారుగా 26 నెలలు జైలులోనే ఉన్నాడు. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. ఈ కేసులో అరెస్ట్ అయిన తర్వాత నుంచి తెలుగు సినిమా రంగానికి దూరమయ్యాడు.
అయితే తాజాగా ముంబైలో ఓ మహిళ ఫిర్యాదు మేరకు ఎజాజ్ ఖాన్‌పై రేప్ కేసు నమోదు చేసినట్టు ముంబై పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నాం. మహిళ ఫిర్యాదు తర్వాత అదృశ్యమయ్యాడు. సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడు అని చారకాప్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపాడు.
చార్‌కాప్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. తనపై ఎజాజ్ ఖాన్ మానభంగానికి పాల్పడ్డాడు అని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతడిని కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించాం. కానీ అతడి మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. రకరకాలుగా ఆయనతో కాంటాక్ట్ కావడానికి ప్రయత్నించాం. కానీ ఫలితం లేకపోయింది. అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నాం అని ఏఎన్ఐకి ఇచ్చిన సమాచారంలో పోలీసులు తెలిపారు.
ఓటీటీ కోసం నిర్మిస్తున్న హౌస్ అరెస్ట్ అనే ప్రాజెక్టు సమయంలో పరిచయం జరిగింది. ఈ సినిమాలో తనకు ఆఫర్ ఇస్తానని మభ్య పెట్టాడు. మా మధ్య పరిచయం మరో లెవెల్‌కు వెళ్లింది. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. తనను పెళ్లి చేసుకొంటానని మోసం చేశాడు. తనపై మార్చి 25వ తేదీన లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి పేరుతో నన్ను మభ్యపెడుతూ తనపై పలుమార్లు మానభంగం చేశాడు అని ఫిర్యాదులో మహిళ తెలిపినట్టు సమాచారం.
ఎజాజ్ ఖాన్‌కు అండ్రియా ఖాన్ అనే యువతితో వివాహం జరిగింది. వారిద్దరికి అలెగ్జాండర్ ఖాన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే తన మతాచారం ప్రకారం నాలుగు పెళ్లిళ్లు చేసుకొనే వెసలుబాటు ఉందని చెప్పాడు. తన సంరక్షణ, బాధ్యతలను చూసుకొంటానని నమ్మించాడు. ప్రస్తుతం పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ముఖం చాటేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాను ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అని చెప్పినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆయనపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) చట్టం ప్రకారం 64, 64 (2), 74 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











