Rakul Preet Singh Wedding: మూడుముళ్ల బంధంతో ఒక్కటైన రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ!
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీలు ఈరోజు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరి నడుమ వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యంగా గోవా వేధికగా రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరిగింది. ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం రోజు.. ముందుగా సిక్కుల సంప్రదాయం ప్రకారం ఆనంద్ కారజ్ అనే పద్ధితిలో వీరి వివాహ వేడుక జరిగింది. ఇక ఆ తర్వాత సింధీ ఆచారాల ప్రకారం మరోసారి పెళ్లి చేసుకున్నారీ క్యూట్ కపుల్.
ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కన్నుల పండువగా సాగిన వీరి వివాహ మహోత్సవానికి అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరు అయ్యారు. ముఖ్యంగా శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా, ఆయుష్మాన్ ఖురానా ఆయన భార్య తాహిరా కశ్యప్, అర్జున్ కపూర్, లవ్ రంజన్, డేవిడ్ ధావన్, వరుణ్ ధావన్ ఆయన భార్య నటాషా దలాల్ రకుల్ పెళ్లిలో పాల్గొని సందడి చేశారు. వీరంతా సోమవారమే గోవాకు చేరుకుని... మూడు రోజుల పాటు సాగిన పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు.

వీరు మాత్రమే కాకుుండా.. ఆదియ్ రాయ్ కపూర్, అనన్య పాండే, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ ఆయన భార్య, భూమి పెడ్నేకల్, ఈషా డియోల్, సోనమ్ కపూర్, వంటి స్టార్ నటీనటీలు కూడా వీరి పెళ్లికి వెళ్లినట్లు సమాచారం. సోమవారం రోజు మెహందీ వేడుక జరగా.. మంగళ వారం రోజు సంగీత్ నిర్వహించినట్లు సమాచారం. అలాగే వధూవరులు ఇద్దరూ...క తమ స్నేహితులకు బ్యాచిలర్ పార్టీలు కూడా ఇచ్చారని తెలుస్తోంది.
ఇదంతా ఇలా ఉండగా.. కరోనా సమయంలో తామిద్దరం దగ్గరయ్యామని.. తమ మధ్య ఉన్నది ప్రేమ అని తెలుసుకుని ప్రపోజ్ చేసుకున్నట్లు, పెళ్లి చేసుకోవాలని భావించినట్లు ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ వెల్లడించింది. దాదాపు మూడేళ్ల క్రితం తన ప్రేమ విషయం బయట పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎట్టకేలకు పెళ్లికి చేసుకుని ఓ ఇంటి కోడలు అయిపోయింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.



Click it and Unblock the Notifications











