Rakul Preet Singh Wedding Card: రకుల్, జాకీ పెళ్లికి ముహూర్తం అప్పుడే.. నెట్టింట వివాహ పత్రిక వైరల్!
గతేడాది చాలా మంది టాప్ హీరో,హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటి వాళ్లు అయిపోయారు. అయితే కొత్త సంవత్సరంలో కూడా చాలా మంది సెలబ్రిటీలు వివాహాలకు రెడీ అయిపోయారు. ఓ ఇంటి వారు అయిపోయి... పర్సనల్ లైఫ్ ను ఆస్వాదించాలని చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. తన ప్రియుడు జాకీ భగ్నానీ చేతనే ఆమె మూడు ముళ్లు వేయించుకోబోతుంది. తాజాగా వీరి పెళ్లి పత్రిక నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కెరటం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన నటనతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో చాలా మంది టాప్ హీరోల సరసన నటించి విపరీతమైన క్రేజ్ ను దక్కించుకుంది. ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ కరోనా సమయంలో నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిందీ క్యూట్ బ్యూటీ.

కరోనా సమయంలో తాము ఇద్దరం దగ్గరయ్యామని.. తమ మధ్య ఉన్నది ప్రేమ అని తెలుసుకుని ప్రపోజ్ చేసుకున్నట్లు, పెళ్లి చేసుకోవాలని భావించినట్లు ఇటీవలే వెల్లడించింది. దగ్గరయ్యామని.. ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడిపామని చెప్పుకొచ్చింది. దాదాపు మూడేళ్ల క్రితం తన ప్రేమ విషయం బయట పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎట్టకేలకు పెళ్లికి సిద్ధం అయిపోయింది. ఇప్పటి వరకు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించకపోయినప్పటికీ.. ఈ ముద్దుగుమ్మ పెళ్లికి సంబంధించిన శుభలేక నెట్టింట వైరల్ గా మారింది.

అందులో రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల పెళ్లి ఫిబ్రవరి 21వ తేదీన జరగనుంది. మూడు రోజుల పాటు వీరి వివాహ వేడుకగా కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా వీరిద్దరూ మిడిల్ ఈస్ట్ లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇండియాలోనే చేసుకోబోతున్నారు. గోవా వేధికగా వీరిద్దరి వివాహం ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది.

అయితే అతి తక్కువ మంది స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్యే వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు. వీరి పెళ్లికి వేసుకునే బట్టలను చాలా స్పైషల్ గా డిజైన్ చేయించుకుంటున్నారట. ముఖ్యంగా వీరిద్దరి పెళ్లి బట్టలను సబ్యసాచి, తరుమ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రాలు కలిసి డిజైన్ చేశారట. అదిరిపోయే ఔట్ ఫిట్స్ వేసుకుని.. తామంటే ఎంతో ఇష్టపడే అతి తక్కువ మంది ఆశీస్సులతో.. గోవా వేధికగా ఈ జంట ఏడడుగులు వేయబోతుంది.


Click it and Unblock the Notifications











