ఆ వార్తలను ఖండిస్తూ .. సో కాల్డ్ జర్నలిస్ట్‌లంటూ.. రకుల్ ఫైర్
టాలీవుడ్‌లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. మొదటి చిత్రం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ హిట్ కావడం, అందులో మంచి నటనను కనబర్చడంతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చింది. అటుపై స్టార్ హీరోలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన రకుల్ జాడ ప్రస్తుతం కనిపించడం లేదు. సినిమాలేవీ లేకపోయినా.. రకుల్ మాత్రం వార్తల్లో నిలుస్తూనే ఉంది.

రానాతో ఎఫైర్ ఉందంటూ..
రకుల్ రానా మధ్య ఏదో నడుస్తోందంటూ అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తోన్నారని, అంతేకాకుండా ఖరీదైన ఇళ్లును కూడా గిఫ్ట్ ఇచ్చినట్టు టాక్ వచ్చింది. అయితే ఆ వార్తలను రకుల్ ఖండించినా.. రూమర్లు మాత్రం ఆగలేదు.

తాజాగా కొత్త ఇళ్లు..
రకుల్ బెంగళూరులో ఓ ఖరీదైన ఇళ్లును కొన్నట్లు గత వారం రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఆరు కోట్లు పెట్టి అత్యంత ఖరీదైన ఇళ్లును కొనేసిందని వార్తలు హల్ చల్ చేశాయి.
ఈ వార్తలను రకుల్ ఖండిస్తూ మీడియాపై ఫైర్ అయింది.

సోకాల్డ్ జర్నలిస్ట్‌లు..
సోకాల్డ్ జర్నలిస్ట్‌లకు ఈ ఫేక్ న్యూస్‌ను ఎక్కడినుంచి పుట్టిస్తారో.. అప్పట్లో హైద్రాబాద్‌లో ఓ ఇళ్లు కొంటే అది ఎవరో గిఫ్ట్ ఇచ్చారని వార్తలు ప్రచారం చేశారు.. ఇప్పుడు బెంగళూరులో ఓ ఇళ్లు కొన్నానని ప్రచారం చేస్తున్నారంటూ ఫైర్ అయింది.

అవన్నీ అబద్దాలే..
తాను బెంగళూరులో కొత్త ఇళ్లు కొన్నానని వస్తోన్న వార్తల్లో నిజం లేదని, ఇలాంటి తప్పుడు వార్తల ప్రచారాన్ని ఆపండి.. ఏవైనా నిజాన్ని వెలికి తీయండంటూ సూచించింది. రకుల్ ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరంగానే ఉంటోన్నట్లు తెలుస్తోంది. మన్మథుడు 2 తరువాత మరే చిత్రాన్ని ఒప్పుకున్నట్లు లేదు.


Click it and Unblock the Notifications











