twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Michael 2022 Teaser: సందీప్ కిషన్ కోసం రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్ కలిసి.. హిట్ కొడతాడా?

    |

    జయాపజయాలను పట్టించుకోకుండా విభిన్న సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు సాగుతున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ప్రస్తుతం ఈ హీరో ఆయన కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమానే మైఖేల్. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడిగా దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది. అయితే ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మైఖేల్ మూవీ హిందీ టీజర్ కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఇద్దరు రంగంలోకి దిగారు. ఆ వివరాళ్లోకి వెళితే..

    సందీప్ కిషన్ ఖాతాలో నాలుగు సినిమాలు..

    సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా కథనే నమ్ముకుని సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. కెరీర్ ప్రారంభంలో విభిన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గతకొంతకాలంగా మాత్రం సందీప్ కిషన్ ను వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. ప్రస్తుతం సందీప్ కిషన్ ఖాతాలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మైఖేల్. ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే ధ్యేయంతో తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా మైఖేల్ గా రాబోతున్నాడు సందీప్ కిషన్. ఈ సినిమాలో సందీప్ కిషన్ కు జోడిగా దివ్యాంశ కౌశిక్ నటించగా.. తమిళ స్టార్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రతో అలరించనున్నాడు.

    అక్టోబర్ 20న రిలీజ్ చేస్తామని..

    రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఇటీవల పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్ తోపాటు అంతకుముందు విడుదలైన సందీప్ కిషన్ ఫస్ట్ లుక్ విశేష స్పందన లభించింది. సిక్స్ ప్యాక్ తో ఎప్పుడూ కనిపించని విధంగా సందీప్ కిషన్ దర్శనమిచ్చి ఆకట్టుకున్నాడు. అలాగే మూవీ టీజర్ ను అక్టోబర్ 20న రిలీజ్ చేస్తామని చెబుతూ ఒక పోస్టర్ విడుదల చేశారు. అందులో సందీప్ కిషన్, హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ లిప్ కిస్ సూపర్ అట్రాక్ట్ అయింది. ఇలా తన మూవీపై అందరి దృష్టి పడేలా ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నాడు సందీప్ కిషన్. తాజాగా మైఖేల్ హిందీ టీజర్ కోసం ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు రంగంలోకి దిగారు.

    రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్ కలిసి..

    ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్, అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్.. సందీప్ కిషన్ మైఖేల్ సినిమాను ప్రమోట్ చేయనున్నారు. అంటే.. మైఖేల్ మూవీ హిందీ టీజర్ ను రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ దర్శకులు రాజ్ అండ్ డీకే కలిసి లాంచ్ చేయనున్నారు. రేపు అంటే అక్టోబర్ 20న సాయంత్ర 5 గంటల 31 నిమిషాలకు జాన్వీ కపూర్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ కలిసి మైఖేల్ హిందీ టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ మూవీని పాన్ ఇండియా తరహాలో తీసుకురాబోతున్న క్రమంలో బాలీవుడ్ లో సెట్ అయిన రకుల్ ప్రీత్ సింగ్, జాన్వీ కపూర్, డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకేతో టీజర్ లాంచ్ చేస్తే సినిమాకు ప్లస్ అవుతుందని సందీప్ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. అయితే సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ చేసిన విషయం తెలిసిందే.

     సందీప్ కిషన్ కు సక్సెస్ ఇస్తారో..

    సందీప్ కిషన్ కు సక్సెస్ ఇస్తారో..

    ఈ సినిమా సమయంలో రకుల్, సందీప్ మంచి స్నేహితులయ్యారు. అప్పుడు ఆ సినిమా ప్రమోషన్స్ లో చాలాసార్లు వారిద్దరు మంచి ఫ్రెండ్స్ గా మారానం అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. ఇప్పుడు రకుల్, జాన్వీ కపూర్ లు సందీప్ కిషన్ కు సక్సెస్ ఇస్తారో వేచి చూడాలి. కాగా ఈ చిత్రంలో డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ విలన్ గా నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేష్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేయనున్నారు.

    English summary
    Bollywood Beauties Rakul Preet Singh Janhvi Kapoor Will Launch Sundeep Kishan Pan India Movie Michael 2022 Hindi Teaser On October 20.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X