‘మన్మథుడు 2’లో యాంకర్ ఝాన్సీకి రకుల్ లిప్ లాక్.. సెన్సార్ రిపోర్టులో షాకింగ్ విషయాలు
Recommended Video
కొద్దిరోజులుగా సరైన హిట్ పడక ఇబ్బందిగా పడుతున్నాడు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. ఈ క్రమంలో ఎన్నో ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. ఆయన గత చిత్రాలు సైతం ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన క్రేజీ కాన్సెప్ట్‌తో చేసిన సినిమానే 'మన్మథుడు 2'. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ ఆయనకు జంటగా నటిస్తోంది. ఫ్రెంచ్ సినిమా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త బయటకు వచ్చింది.

సెన్సార్ రిపోర్డు
ఈ సినిమాను వీక్షించిన సెన్సార్ యూనిట్ ‘మన్మథుడు 2'కు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ 2.35 గంటలు ఉంది. వాస్తవానికి ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లలో ఉన్న సీన్లను బట్టి దీనికి A సర్టిఫికెట్ జారీ చేస్తారని అనుకున్నారు. కానీ, దానికి భిన్నంగా U/A సర్టిఫికెట్ రావడంతో చిత్ర యూనిట్‌తో పాటు నాగ్ అభిమానులు ఖుషీ అయ్యారు.

U/A సర్టిఫికెట్ ఇవ్వడానికి కారణం ఇదే
‘మన్మథుడు 2'కు U/A సర్టిఫికెట్ ఇవ్వడానికి కారణం ఏంటనేది తెలిసిపోయింది. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ అంతా ఫారెన్‌లో జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులకు తగ్గట్లు సినిమాలో కిస్‌లు, బోల్డ్ డైలాగ్స్ ఉంటాయి. అందుకే సెన్సార్ యూనిట్ దీన్ని లైట్ తీసుకుందని అంతా అనుకున్నారు. అయితే, ఆ రిపోర్టు బయటకు రావడంతో విషయం తెలిసింది.

సెన్సార్ చేయడానికి ఓకే చెప్పడంతోనే..
ఈ సినిమాలోని కొన్ని సీన్లు, డైలాగులపై సెన్సార్ బోర్డ్ అభ్యంతరం చెప్పిందని తెలిసింది. వాటిని కట్ చేయడం లేదా మ్యూట్, బ్లర్ చేయడం చేయాలని లేకపోతే ఏ సర్టిఫికెట్ జారీ చేస్తామని సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌కు చెప్పారట. దీంతో రెండో దానికి ఓకే చెప్పేసిందట ‘మన్మథుడు 2' టీమ్. దీంతో తొమ్మిది సందర్భాల్లో సెన్సార్ చేశారని రిపోర్ట్ ఇచ్చారు.

ఝాన్సీకి రకుల్ కిస్
బయటకు వచ్చిన రిపోర్టు ప్రకారం.. రెండు సీన్లను బ్లర్ చేశారు. అలాగే, ఆరు చోట్ల డైలాగులను మ్యూట్ చేశారు. వీటితో పాటు మద్యం సేవించే సందర్భంలో హెచ్చరికలు వేశారు. బ్లర్ చేసిన రెండు సీన్లలో ఒకటి.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. సహ నటి ఝాన్సీకి లిప్ లాక్ ఇచ్చిన సీన్ అని రాసి ఉంది. ఇది బయటకొచ్చినప్పటి నుంచి అందరూ షాక్ అవుతున్నారు.

‘మన్మథుడు 2' గురించి..
అక్కినేని నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2'. మనం ఎంటర్ ప్రైజెస్, ఆనంది ఆర్ట్స్, వయకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్ (జెమిని కిరణ్) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











