దగ్గుబాటి రానాతో రకుల్ ప్రీత్ డేటింగ్.. నోరువిప్పిన హీరోయిన్.. అసలు సంగతి బయటపెడుతూ!
రంగుల ప్రపంచంలో రకరకాల రూమర్స్ రావడం కామన్‌గా జరిగే విషయమే. ఆ హీరోకు ఈ హీరోయిన్‌తో లింకు, ఈ హీరోయిన్ ఆ హీరోతో డేటింగ్ చేస్తోందంటూ నిత్యం ఎన్నో వార్తలు వింటూనే ఉంటాం. అయితే వాటిలో కొన్ని రూమర్స్ అయితే.. మరికొన్ని నిజం కూడా అవుతుండటం చూస్తుంటాం. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ డేటింగ్ గురించిన కొన్ని రూమర్స్ షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ విషయమై స్వయంగా స్పందించింది రకుల్. వివరాల్లోకి పోతే..

దగ్గుబాటి రానాతో రకుల్ ప్రీత్ లింక్
ఉత్తరాది, దక్షిణాది సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. సౌత్ ఇండియన్ స్టార్ హీరో దగ్గుబాటి రానాతో రిలేషన్‌లో ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఎక్కువగా పార్టీలు, పబ్బుల్లో స్నేహితులతో కలిసి తిరుగుతున్నారంటూ తెగ వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ విషయమై రకుల్ నోరు విప్పక తప్పలేదు.

ఎక్కడికెళ్లినా అవే ప్రశ్నలు.. రకుల్ రియాక్షన్
సినీ పరిశ్రమకు వచ్చిన నాటి నుంచే దగ్గుబాటి రానాతో రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో స్నేహంగా ఉంటూ వస్తోంది. దీంతో వీరిద్దరిపై వస్తున్న రూమర్స్, వీరి సాన్నిహిత్యం చూసి.. రకుల్ ఎక్కడికెళ్లినా అవే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో ఆమె వద్ద ఇదే అంశం ప్రస్తావనకు రావడంతో ఓ క్లారిటీ ఇచ్చేసింది రకుల్.

ఓ మై గాడ్.. అలా అనుకుంటున్నారా..?
ఓ మై గాడ్.. పొరపాటున కూడా అలా అనుకోకండి. దగ్గుబాటి రానా నాకు మంచి మిత్రుడు మాత్రమే అని చెప్పేసింది రకుల్. నేను సినీ జర్నీ మొదలు పెట్టిన నాటి నుంచే రానాతో స్నేహంగా ఉంటున్నానని చెప్పింది ఈ పంజాబీ బ్యూటీ. తనకు తెలుగు సినీ పరిశ్రమలో దగ్గుబాటి రానాతో పాటు మంచు లక్ష్మి కూడా మంచి స్నేహితురాలిని చెప్పింది రకుల్.

ప్రస్తుతం సింగల్.. నో రూమర్స్
ప్రస్తుతం తానూ సింగల్ అని, రానానే కాదు ఏ ఒక్కరితో తాను డేటింగ్ చేయడం లేదని పేర్కొంటూ తనపై వస్తున్న రూమర్లను ఖండించింది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తాను సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నానని, లవ్, డేటింగ్ లాంటి వ్యవహారాల జోలికి వెళ్లే పరిస్థితి లేదని ఆమె పేర్కొంది. సో.. అలాంటి రూమర్స్ నమ్మొద్దని క్లారిటీ ఇస్తున్నా అని రకుల్ చెప్పేసింది.

నాగార్జునతో రొమాన్స్.. బాలీవుడ్ నటుడితో కూడా
ఇక ఇటీవలే సీనియర్ హీరో అక్కినేని నాగార్జునతో మన్మథుడు 2 సినిమాలో రొమాన్స్ చేసి గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది రకుల్. ప్రస్తుతం ఆమె మార్జావన్ అనే హిందీ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా సరసన నటిస్తోంది. నవంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











