ఆ మాట వినగానే షాకయ్యా.. చాలా బాధగా ఉంది: రకుల్ ప్రీత్ సింగ్

ఇండియన్ డైరెక్టర్ శంకర్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారతీయుడు 2 సెట్స్ పై ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, డైరెక్టర్ శంకర్ సహా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రమాదం వార్త తెలియగానే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.

'భారతీయుడు 2 సినిమా సెట్లో ప్రమాదం జరిగిందని తెలిసి షాకయ్యాను. ఈ ఘటన వార్త హృదయాన్ని కలిచివేసింది. మృతుల కుటుంబాలకు పూడ్చలేని నష్టం వాటిల్లింది. మరణించిన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా'' అని పేర్కొంది రకుల్.

అప్పట్లో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది భారతీయుడు 2 సినిమా. శంకర్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Rakul Preet Singh Reaction On Major Accident At Indian 2 Sets

ఈ సినిమాను ఏ ముహూర్తాన అనుకున్నారో గానీ అడుగడుగునా ఆటంకాలే ఏర్పడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్‌లో ఘోర ప్రమాదం జరగడంతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ కూడా ఉలిక్కిపడింది. లైటింగ్ కోసం భారీ క్రేన్స్ సహాయంతో సెట్ డిజైన్ చేస్తుండగా క్రేన్ తెగిపడటంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X