నిన్నే పెళ్లాడతా.. అంటూ రంగంలోకి రకుల్ ప్రీత్ సోదరుడు!
నాగార్జున హీరోగా వచ్చిన 'నిన్నే పెళ్లాడుతా' తెలుగు సినీ పరిశ్రమలో వచ్చిన క్లాసిక్ హిట్ చిత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అయితే ఇదే పేరుతో త్వరలో మరో మూవీ రాబోతోంది. ఈ సినిమా ద్వారా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. అక్కినేని నాగార్జున చేతుల మీదుగా దీన్ని విడుదల చేశారు. వైకుంఠ బోను దర్శకత్వంలో రూపొందబోయే ఈ చిత్రాన్ని అంబికా ఆర్ట్స్, ఈశ్వరి ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.

పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైకుంఠ బోను మాట్లాడుతూ... నాగార్జునగారి చేతుల మీదుగా తమ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇందులో సిద్ధికా హీరోయిన్. సాయి కుమార్, సీత, ఇంద్రజ, సిజ్జు, ఆన్నపూర్ణమ్మ, మధునందన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు వెల్లడించారు.
'నిన్నే పెళ్లాడుతా' చిత్రానికి సంబంధించిన 50 శాతం షూటింగ్ పూర్తయింది. చివరి షెడ్యూల్ ఆగస్టు నుంచి వైజాగ్‌లో షూటింగ్ జరుపుకుంటుందని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన అక్టోబర్ మాసంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్, సినిమాటోగ్రఫీ: ఈదర ప్రసాద్, ఫైట్స్: రామకృష్ణ.


Click it and Unblock the Notifications











