Rakul Preet Singh రకుల్ ప్రీత్ సింగ్ కొత్త బిజినెస్.. హైదరాబాద్‌లోనే ఫస్ట్ బ్రాంచ్!

దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్రతారగా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకొన్న హీరోయిన్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఆమె ఇటీవల కాలంలో బాలీవుడ్‌కే పరిమితమయ్యారు. హిందీ సినిమా రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నటిగా తన కెరీర్‌ను కొనసాగిస్తూనే బిజినెస్ రంగంలో కూడా తనకంటూ గుర్తింపును తెచ్చుకొన్నది. తాజాగా ఓ కొత్త వ్యాపారరంగంలోకి అడుగుపెట్టనున్నారు. . ఆ వ్యాపారం ఏమిటనే వివరాల్లోకి వెళితే..

రకుల్ ప్రీత్ సింగ్ కన్నడ రంగంలోకి తొలి సినిమాలో నటించి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా ద్వారా వరుస విజయాలు సాధించడంతో కొద్దికాలంలోనే స్టార్ హీరోయిన్‌‌గా పాపులారిటీని సాధించారు. మహేష్, కార్తీ, చైతూ లాంటి హీరోలతో కలిసి నటించారు.

Rakul Preet Singh to Food Business Indian 2 Actress to Start Aarambham Restaurant in Hyderabad

తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే ఫిట్‌నెస్ సెంటర్లను ప్రారంభించారు. హైదరాబాద్‌, వైజాగ్‌లోనే కాకుండా దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేసి హెల్త్, అండ్ ఫిట్‌నెస్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. వాటిని కొనసాగిస్తూనే నటిగా కెరీర్‌ను చక్కదిద్దుకొన్నారు.

ఇక తాజాగా ఆమె ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. దేశవ్యాప్తంగా రెస్టారెంట్లను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఈ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్‌లో ఆమె ఓ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 16వ తేదీన ఆరంభం అనే పేరుతో తొలి రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

Rakul Preet Singh to Food Business Indian 2 Actress to Start Aarambham Restaurant in Hyderabad

ఇదిలా ఉండగా, రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. కొన్నేళ్లుగా ప్రేమించుకొని డేటింగ్ చేస్తున్న ఇద్దరు డెస్టినేషన్ వెడ్డింగ్ పద్దతిలో వివాహం చేసుకొన్నారు. పెళ్లి చేసుకొన్న వెంటనే కొత్త బిజినెస్‌ను ప్రారంభించడం విశేషంగా మారింది.

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ విషయానికి వస్తే.. 2023 సంవత్సరంలో చత్రివాలి, బూ, ఐ లవ్ యూ చిత్రాల్లో నటించారు. కానీ ఆ సినిమాలు అంతగా విజయం సాధించలేదు. ఇక 2024 సంవత్సరంలో ఆయలాన్ చిత్రాల్లో నటించారు. హిందీలో మేరీ పత్న కా రీమేక్ నటించారు. అలాగే తమిళ చిత్రం ఇండియన్ 2 రిలీజ్‌కు సిద్దంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X