ఊహించని ఆ ఘటనతో రకుల్ అలిగి వెళ్లిందా..? హాట్ టాపిక్ అవుతున్న ఇష్యూ

కొన్ని సందర్భాల్లో ఊహించని సంఘటనలు మనసును బాధ పెడుతుంటాయి. అలాంటి ఓ సంఘటన తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఎదుర్కొందని తెలుస్తోంది. నిన్న (ఆదివారం) జరిగిన సినీ మహోత్సవంలో ఈ ఘటన జరిగిందని, దీంతో రకుల్ అలిగి వెళ్లిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలేంటో చూద్దామా..

తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ 25వ వార్షికోత్సవం సందర్బంగా 'సినీ మహోత్సవం' పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు. చిరంజీవి సహా అలనాటి మేటి తారలతో కళకళలాడింది సినీ మహోత్సవ వేదిక. ఇక నేటితరం యంగ్ హీరోయిన్స్‌ అందాలతో వేదికా ప్రాంగణమంతా మెరిసిపోయింది.

Rakul Preet Singh Un Happy In Cinemahotsavam 2019..?

చాలా మంది యంగ్ హీరోయిన్స్ వేదికపై లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ డాన్స్ పెర్ఫార్మెన్స్ కమిట్ అయ్యింది.మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ప్రదర్శన పూర్తి కాగానే రకుల్ ప్రీత్ సింగ్ పెర్ఫార్మెన్స్ మొదలు కావాల్సి ఉంది కానీ అలా జరగలేదు. అదే సమయంలో చిరంజీవి రావడంతో వేడుకలో ఒక్కసారిగా హడావిడి నెలకొంది. ఆ వెంటనే ప్రముఖుల స్పీచ్‌ల కార్యక్రమం మొదలైంది. చిరంజీవి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో రకుల్ పెర్ఫార్మెన్స్ సాధ్యపడలేదు.

ఇదంతా చూసిన ఆడియన్స్ రకుల్ ప్రీత్ సింగ్ అలిగిందని ప్రచారం మొదలుపెట్టేశారు. స్టేజ్‌పై పెర్ఫార్మ్ చేయనందుకు ఫీలైందని చెప్పుకుంటున్నారు. దీంతో సినీ మహోత్సవం నుంచి రకుల్ అలిగి వెళ్లిపోయిందంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్‌లో ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X