బిగ్ బాస్‌లో రకుల్.. నాగార్జున ఇలా కూడా వాడేస్తున్నాడా?

Recommended Video

Bigg Boss Telugu 3 : Rakul Preet Singh To Enter Into The Bigg Boss House || Filmibeat Telugu

తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ హోస్ట్ గా నాగార్జున బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. గతంలో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' లాంటి షోస్ ద్వారా బుల్లితెర పాపులారిటీ తెచ్చుకున్న ఈ వెండితెర మన్మథుడు.. ఈ సారి బిగ్ బాస్‌గా అలరిస్తున్నాడు. ఈ షో ప్రారంభానికి ముందు పలు వివాదాలు చుట్టుముట్టినా, నాగ్ ఇంటి ముందు ధర్నాలు చేసినా కూడా అవేవీ బిగ్ బాస్‌ని ఆపలేకపోయాయి. ఇకపోతే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు నాగార్జున బిగ్ బాస్ లోకి రకుల్ ప్రీత్ సింగ్‌ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

మన్మథుడు 2 లో రకుల్‌తో నాగార్జున రొమాన్స్

మన్మథుడు 2 లో రకుల్‌తో నాగార్జున రొమాన్స్

నాగార్జున అప్‌కమింగ్ మన్మథుడు 2. ఈ చిత్రంలో నాగార్జున సరసన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన మన్మథుడు 2 టీజర్, ట్రైలర్ ద్వారా రకుల్‌తో నాగార్జున రొమాన్స్ ఎలా ఉంటుందనేది స్పష్టమైంది. ఆగస్టు 9 వ తేదీన ఈ సినిమా విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ లోగానే బిగ్ బాస్ లోకి రకుల్

ఈ లోగానే బిగ్ బాస్ లోకి రకుల్

అయితే ఆగస్టు 9 వ తేదీ లోగానే బిగ్ బాస్ లోకి రకుల్ ప్రీత్‌ని తీసుకు రావాలని నాగార్జున సన్నాహాలు చేస్తున్నారట. ఇంతకీ ఎందుకంటారా? అదేనండీ.. మన్మథుడు 2 ప్రమోషన్స్ కోసం. భారీ ఫాలోయింగ్ ఉన్న బిగ్ బాస్ షో ద్వారా మన్మథుడు 2 ప్రమోషన్స్ చేసే విదంగా నాగార్జున స్కెచ్ వేశారట. ఈ మేరకు బిగ్ బాస్ వేదికపైకి రకుల్ ని ఆహ్వానించబోతున్నాడని తెలిసింది.

గత సీజన్స్‌లో లాగే..

గత సీజన్స్‌లో లాగే..

ఇప్పటివరకు ప్రసారమైన గత సీజన్స్ లో కూడా ఇదే జరిగింది. మొదటి సీజన్ చేస్తున్నపుడు హోస్ట్ గా ఉన్న ఎన్టీఆర్ తన జై లవకుశ ప్రమోషన్స్ చేశాడు. అదే బాటలో రెండో సీజన్ లో నాని కూడా తన దేవదాస్ సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. ఇప్పుడు నాగార్జున సైతం అదే పని చేయబోతున్నారన్నమాట. ఏదేమైనా బిగ్ బాస్ ద్వారా మన్మథుడు 2 ప్రమోట్ చేయడం, అందుకు గాను రకుల్‌ని బిగ్ బాస్ వేదిక మీదకు ఆహ్వానించడం ఆసక్తికర అంశమే మరి.

మన్మథుడు 2 మూవీ

మన్మథుడు 2 మూవీ

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' మూవీ తెరకెక్కుతోంది. గతంలో నాగార్జున కెరీర్ లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన మన్మథడు చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆడిపాడింది. సమంత, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్ 9 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X