Drug Case: రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అరెస్ట్.. డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌ను డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్కోటిక్ పోలీసులు పట్టుకొన్నారు. ఆయనను అరెస్ట్ చేసినట్టు ప్రాథమికంగా సమాచారం. ఇటీవల కాలంలో డ్రగ్స్ నిర్మూలించే క్రమంలో తీవ్రమైన, కఠిన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భారీగా మెరుపు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్లో అమన్ ప్రీత్ సింగ్ పట్టుబడినట్టు తెలుస్తున్నది.

గత కొద్దికాలంగా అమన్ దీప్ సింగ్ కుటుంబ సభ్యులపై డ్రగ్స్ సరఫరా వినియోగం ఆరోపణలు వస్తున్నాయి. ఆ క్రమంలో ఆయనపై పోలీసులు నిఘా పెట్టారు. నిఘా వర్గాల సమాచారం మేరకు అమన్ దీప్ సింగ్‌ నివాసంపై, ఆయన తిరిగే ప్రదేశాలపై మెరుపు దాడులు చేశారు. ముందస్తు సమాచారం మేరకు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు.

Rakul Preet Singh s Brother Aman Preet Singh arrested in Drugs case in Hyderabad

నార్కోటిక్స్ విభాగం పోలీసులు అందించిన సమాచారం మేరకు అమన్ దీప్ నుంచి 2 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను పట్టుకొన్నారు తెలుస్తున్నది. ఆయనను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తున్నది.

తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ జరిపిన దాడుల్లో అమన్ ప్రీత్ నుంచి భారీగా కొకైన్ స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం. నైజీరియాకు చెందిన ఐదుగురు 2.6 కిలోల కొకైన్ అమ్మడానికి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వారి వద్ద దాదాపు 30 మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. ఆ 30 మంది సభ్యుల పేర్లను సైబరాబాద్ కమిషనర్‌కు అందజేశారు. పోలీసులు వారిపై దర్యాప్తు చేస్తున్నారు అని పోలీసులు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X