For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ అల్లాడికి అరుదైన గౌరవం.. ప్రవాసాంధ్రుడికి దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు

    |

    ప్రవాసాంధ్రుడు, న్యూయార్క్‌కు చెందిన దర్శకుడు రామ్ అల్లాడికి అరుదైన గౌరవం దక్కంది. ఇప్పటికి పలు అవార్డులను అందుకొన్న ఆయనకు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ''రా'స్ మెటనోయా"కి గాను ఉత్తమ దర్శకుడు విభాగంలో ఆయన విజేతగా నిలిచారు.

    చేసిల్డ్ డాక్యుమెంటరీతో దర్శకుడిగా మారిన రామ్ అల్లాడి, తొలి ప్రయత్నంలో ప్రేక్షకుల ప్రశంసలతో‌పాటు పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. దర్శకుడిగా ఆయన తీసిన రెండో చిత్రం "రా'స్ మెటనోయా". నవంబర్ 2020లో విడుదలైంది. జాతిపిత మహాత్మా గాంధీ జీవితంపై ప్రేమతో రామ్ అల్లాడి తీసిన ఈ చిత్రానికి ఇప్పటికే పన్నెండుకు పైగా అవార్డులు వచ్చాయి. యూరోపియన్, న్యూయార్క్ సినిమాటోగ్రఫీ అవార్డులు, లండన్స్ గోల్డ్ మూవీ అవార్డులు ఈ చిత్రానికి దక్కాయి.

    వెనిస్ షార్ట్స్, ది ఆమ్‌స్టర్‌డ్యామ్‌ వరల్డ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో "రా'స్ మెటనోయా" బెస్ట్ బయోగ్రఫికల్ ఫిల్మ్‌గా పలు అవార్డులు అందుకుంది. న్యూయార్క్ నగరంలో ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ స్క్రీన్-ప్లే, కల్ట్ క్రిటిక్ మూవీ అవార్డ్స్‌లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఫిల్మ్ అవార్డులు... వర్జిన్ స్ప్రింగ్ సినీఫెస్ట్‌లో ఎడిటింగ్, స్కోర్, ఫిల్మ్ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. 'రీల్ హార్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అండ్ స్క్రీన్ ప్లే' 17వ వార్షిక చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమా ఎంపికైంది. ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్'లో రామ్ అల్లాడిని వరించింది.

     Ram Alladi gets Dada Saheb Phalke Film Festival Award

    ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదా సాహెబ్ ఫాల్కే జయంతి సందర్భంగా ఏప్రిల్ 30న దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సుమారు 110 దేశాలకు చెందిన ఫిల్మ్ మేకర్స్ తీసిన సినిమాలు అవార్డుల కోసం వివిధ విభాగాల్లో పోటీ పడ్డాయి. ఈ పోటీలో "రా'స్ మెటనోయా"కు గాను ఉత్తమ దర్శకుడిగా రామ్ అల్లాడికి అవార్డు లభించింది. ఈ అవార్డు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

    ప్రస్తుతం సంస్కృత సినిమా నభాంసికి రామ్ అల్లాడి దర్శకత్వం వహిస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చిలో చిత్రీకరణ ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంస్కృత సినిమా తీస్తున్న తొలి దర్శకుడు ఆయనే కావడం గమనార్హం. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.

    English summary
    Film maker Ram alladi makes Telugu people proud again. He bags an award as Best director in prestigious dadasaheb phalke film festival for his "Ra's Metanonia" Which is also selected at "17th Annual ReelHeART International Film and Screenplay Festival" Long way ahead
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X