twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ అల్లాడి దర్శకత్వంలో సంస్కృతంలో నభాంసి.. 14 అంతర్జాతీయ అవార్డులతో సత్తా చాటిన ప్రవాసాంధ్రుడు!

    |

    న్యూయార్క్ స్థిరపడిన ప్రవాసాంధ్రుడు రామ్ అల్లాడి మరోసారి సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. చేసిల్డ్ అనే డాక్యుమెంటరీ చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన ప్రేక్షకుల ప్రశంసలతోపాటు 11 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకొన్నారు. ఆ తర్వాత జాతిపిత మహాత్మాగాంధీ జీవితంలోని కొన్ని కీలక సంఘటనల ఆధారంగా రూపొందించిన రాస్ మెటనోయా అనే చిత్రాకి 14 అంతర్జాతీయ పురస్కారాలు సొంతం చేసుకొన్నారు.

    ప్రస్తుతం మూడో ప్రయత్నంగా నంభాసి (ఆకాశాలు) అనే సంసృత సినిమాను తెరకెక్కించేందుకు రామ్ అల్లాడి సిద్దమయ్యారు. రామ్ అల్లాడి దర్శకత్వంలో 'మెటనోయా' నిర్మించిన ఏఆర్ ఐటీవర్క్స్ సంస్థ 'నభాంసి' చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఇప్పుటికే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా ఈ నెల 8న చిత్రీకరణ ప్రారంభం కానుంది.

    Ram Alladi to direct Sanskrit Movie Nabhamsi

    ఈ సందర్భంగా రామ్ అల్లాడి మాట్లాడుతూ " భారతదేశంలో 1000 ఏళ్ల క్రితం జరిగిన కథను ఆధారంగా చూసుకొని నంభాసి సినిమాను రూపొందిస్తున్నాం. భార్యాభర్తల మధ్య జరిగే రొమాంటిక్ కథ ఇది. తన చిన్ననాటి అమూల్యమైన జ్ఞాపకాల్ని భర్త చేధిస్తూ ఉంటాడు . ఆ చేధనలోనే భార్యతో జరిపిన రొమాన్స్ ఆయనలో శాశ్వతంగా మదిలో నిలిచిపోతుంది. చివరి వరకూ ఆ జ్ఞాపకాల్ని చేధించడం కోసమే తపిస్తుంటాడు. ఒక విధంగా ఈ ప్రక్రియను అర్ధ నారీశ్వర తత్త్వం అని చెప్పవచ్చు అని అన్నారు.

    Ram Alladi to direct Sanskrit Movie Nabhamsi

    నంభాషి చిత్రంలో సాహిత్యం, సంగీతం, నృత్యానికి సినిమాలో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. చరిత్రతో కనుమరుగైపోయిన కొన్ని నృత్యాలను మా చిత్రంలో చూపించబోతున్నాం. కంప్యూటర్ గ్రాఫిక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. 75 శాతం సినిమాను అమెరికాలో తీస్తాం. మరో 25 శాతం సినిమా చిత్రీకరణ మన దేశంలోని కొన్ని ప్రముఖ దేవాలయాల్లో చేస్తాం. ఇందులో మతాలు, తత్వాలకు సంబంధించిన చర్చకు తావు లేదు" అని రామ్ అల్లాడి అన్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు అన్నిటినీ ప్రవాస భారతీయులు పోషించనున్నారని ఆయన తెలిపారు.

    సంస్కృతంలో సినిమా తీయాలనే ఆలోచన గురించి రామ్ అల్లాడి వివరిస్తూ "ఆ కాలంలో అమూల్యమైన జీవితాన్ని కవితాత్మకంగా చెప్పడానికి సంస్కృతం బాగా ఉపయోగపడుతుంది. సంస్కృతంలో 'నభ' అంటే 'ఆకాశం' అని అర్థం. 'నభాంసి' అంటే ఆకాశాలు అని అర్థం. కన్నడ దర్శకుడు జీవీ అయ్యర్ సంస్కృతంలో తొలి సినిమా 'ఆదిశంకరాచార్య' చేశారు. తర్వాత సంస్కృతంలో 'భగవద్గీత' తెరకెక్కించారు. రెండూ ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా పురస్కారాలు అందుకున్నాయి. ఆ రెండు చిత్రాల స్పూర్తితో సంస్కృతంలో సినిమా చేయాలని అనుకున్నాను. 'నభాంసి' కోసం నేను సంస్కృతం నేర్చుకున్నాను" అన్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన చెప్పారు. 2022లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    Ram Alladi to direct Sanskrit Movie Nabhamsi

    తెర వెనుక
    స్క్రీన్ ప్లే, డైరెక్షన్: రామ్ అల్లాడి.
    సంభాషణలు: సరితా నవాలి, మధు గుంటుపల్లి
    ఎడిటర్: రాకేష్ చల్లా
    సినిమాటోగ్రఫీ: రామ్ అల్లాడి - సతీష్ రొంటల
    మ్యూజిక్ డైరెక్టర్: భరద్వాజ్ వీ కొమరగిరి
    ప్రొడక్షన్ హౌస్: ఏఆర్ ఐటీవర్క్స్,

    English summary
    As per IMDB, Ram Alladi is a director and screenwriter based in New York. He is passionate about language and story-telling, he began work in 2016 on his debut film, Chiseled. Now, He is attempting his third movie Nabhamsi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X