Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Ram Asur రోడ్డుపై పోస్టర్లు అంటించిన హీరో, హీరోయిన్లు.. విభిన్నమైన ప్రమోషన్స్‌తో..
విభిన్నమైన కథ, కథనాలతో మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిన్న చిత్రాలు టాలీవుడ్లో ఘన విజయం సాధిస్తున్నాయి. యువ హీరోయిన్లు తమ సత్తాను చాటుతూ సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్నారు. తాజా ఆ కోవలోనే రామ్ అసుర్ చిత్రంగా నిలిచే అవకాశం కనిపిస్తున్నారు. రిలీజ్‌కు ముందే మంచి బజ్‌ను రామ్ అసుర్ సొంతం చేసుకోవడంతో యూనిట్ విభిన్నంగా ప్రమోషన్ చేయడం కనిపించింది.
తాజాగా తమ సినిమా ప్రమోషన్ కోసం గతంలో ఎన్నడూలేని విధంగా రామ్ అసుర్ హీరో అభినవ్ సర్దార్, హీరోయిన్ చాందిని వినూత్నమైన ప్లాన్ చేశారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలకు పోకుండా స్వయంగా జనంలోకి వెళ్లి తమ సినిమా చూడండి, మంచి కంటెంట్ ఉన్న మూవీ అని వాళ్ళు చెప్పారు. బస్టాండ్ లాంటి పబ్లిక్ ఏరియాల్లో తిరుగుతూ రామ్ అసుర్ మూవీ గురించి వివరించారు. అంతేకాదు వాల్ పోస్టర్స్ కూడా స్వయంగా ఆ ఇద్దరే అంటించి ప్రమోషన్స్‌లో డిఫరెంట్ స్ట్రాటజీ చూపించారు.
వెంకటేష్ త్రిపర్ణ దర్శకత్వంలో అభినవ్ సర్ధార్, వెంకటేష్ త్రిపర్ణ సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న "పీనట్ డైమండ్" చిత్రం మాస్ ఆడియన్స్‌కు రీచ్ కావాలని ఈ చిత్ర టైటిల్‌ను రామ్ అసుర్గా మార్చడమైనది అని తెలిపారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా నవంబర్ 19న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాలో అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్, చాందిని తమిళ్‌రాసన్, శాని సాల్మాన్, శెర్రి అగర్వాల్ లీడ్ రోల్స్ పోషించారు. బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చుతున్నారు.
ఏఎస్పీ మీడియా హౌస్, జీవీ ఐడియాస్ పతాకాలపై నిర్మించారు. ఇటీవల ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా విశేష స్పందన లభించింది. అలాగే ఈ చిత్ర ట్రైలర్‌ని ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్‌ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేయడం విశేషం. ఇక రీసెంట్గా పలువురు సినీ ప్రముఖుల మధ్య గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన తెచ్చుకుంటోంది.