'అర్జున్ రెడ్డి' మారిపోయాడు.. వెరైటీగా స్పందించిన రాంచరణ్!
Recommended Video

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటించిన గీత గోవిందం చిత్రానికి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్, రాజమౌళి వంటి ప్రముఖులు గీత గోవిందం చిత్ర యూనిట్ ని అభినందించారు. ఆ జాబితాలోకి మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా చేరాడు. కాకపోతే రాంచరణ్ కాస్త వెరైటీగా స్పందించాడు.

అర్జున్ రెడ్డి మారిపోయాడు
అర్జున్ రెడ్డి చిత్రం తరువాత విజయ్ దేవరకొండ పూర్తిగా మారిపోయాడు. రష్మిక, విజయ్ దేవరకొండ ని ఇలాంటి చిత్రంలో చూడడం ట్రీట్ లాంటిది. కథకు అనుగుణంగా ఇద్దరూ అద్భుతంగా నటించారు అని రాంచరణ్ తెలిపాడు.

సంగీతం
గోపి సుందర్ అందించిన సంగీతం కూడా చాలా బావుంది. దర్శకుడు పరశురామ్ మంచి కథ సిద్ధం చేసుకుని దానిని అందంగా మలిచాడు అని ప్రశంసించాడు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్, ఇతర నటీనటులకు రాంచరణ్ శుభాకాంక్షలు తెలియజేశాడు.
అర్జున్ రెడ్డి తరువాత
అర్జున్ రెడ్డి తరువాత విజయ్ దేవరకొండకు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది. మిగిలిన జోనర్ కథలలో ఈ హీరోని ఊహించుకోగలరా అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో గీత గోవిందం చిత్రంతో విజయ్ దేవరకొండ ఆ అనుమానాల్ని పటాపంచలు చేశాడు.

రష్మిక
గడసరి పిల్లగా రష్మిక మందన నటనకు యువత ఫిదా అవుతున్నారు. టాలీవడ్ లో రష్మిక క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక మరిన్ని అవకాశాలు ఆమె దరి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











