ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్ పై RRR.. Jr NTR గురించి రామ్ చరణ్ ఏమన్నాడో తెలుసా?

చిరుత సినిమాతో మెగాస్టార్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ తో అలరించిన చెర్రీ అనతికాలంలోనే మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇక గతేడాది వచ్చిన రౌద్రం రణం రుధిరం (RRR) సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా రామ్ చరణ్ మాత్రమే కాకుండా ఎంటైర్ యూనిట్ కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. ఇక ఇటీవల ఈ సినిమాను ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్ లో స్క్రీనింగ్ చేశారు. ఈ ప్రదర్శ తర్వాత ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా అక్కడ అనుభవించిన అనుభూతులను పంచుకున్నాడు.

ప్రభంజనం కొనసాగుతూ..

ప్రభంజనం కొనసాగుతూ..

తెలుగు చిత్రీసీమ దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఎల్లలు దాటి అశేష ప్రేక్షకగనం ప్రశంసించేలా చేసింది. ఇక గతేడాది విడుదలైన ఈ సినిమా అవార్డులతో సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్, సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్, హెచ్సీఏ అవార్డులు గెలుచుకుని ఇంకా ప్రభంజనం కొనసాగిస్తోంది. ..

విడుదలకు ముందే..

విడుదలకు ముందే..

ఇదిలా ఉంటే RRR సినిమా గతేడాది మార్చి 25న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజైన 342 రోజులకు వరల్డ్ లోనే అతిపెద్ద స్క్రీనింగ్ థియేటర్ లో స్క్రీనింగ్ చేశారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఉన్న 'ది థియేటర్ ఎట్ ఏస్ హోటల్'లో మార్చి 1న RRR చిత్రాన్ని ప్రదర్శించారు. 1647 సీటింగ్ కెపాసిటీ గల ఈ థియేటర్ టికెట్స్ మొత్తం విడుదలకు ముందే అమ్ముడుపోగా.. మార్చి 1న సాయంత్రం 7:30 నిమిషాలకు స్క్రీనింగ్ జరిగింది.

 నెట్టింట్లో వైరల్..

నెట్టింట్లో వైరల్..

ఏస్ హోటల్ థియేటర్ లో RRR స్క్రీనింగ్ తర్వాత హీరో రామ్ చరణ్ అక్కడి ప్రేక్షకులను కలిశారు. వారితో కలిసి సెల్ఫీలు సైతం దిగారు. సినిమా చూసేందుకు పోటెత్తిన ప్రేక్షకులను చూసిన చెర్రీ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అక్కడ ప్రేక్షకులు RRR సినిమాకు ఇచ్చిన స్టాండిగ్ ఓవేషన్ చూసి ఆశ్యర్యపోయాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ గా పలు వ్యాఖ్యలు రాసుకొచ్చాడు.

మధురమైన జ్ఞాపకంలా..

మధురమైన జ్ఞాపకంలా..

"ఏస్ థియేటర్ లో RRR సినిమా స్క్రీనింగ్ జరిగింది. మీ నుంచి వచ్చిన స్పందన, స్టాండింగ్ ఓవేషన్ చూసి చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలు నా జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకంలా ఉంటాయి. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆల్వేస్ గ్రేట్ ఫుల్" అని రాసుకొచ్చాడు చెర్రీ. అనంతరం అక్కడ RRR, రాజమౌళి గురించి పలు విషయాలు పంచుకున్నాడు రామ్ చరణ్.

 ఈ క్షణాల కోసం..

ఈ క్షణాల కోసం..

"నేను ప్రతి ఒక్కరికోసం మాట్లాడగలనో లేదో నాకు తెలియదు. కానీ, ఒక నటుడిగా ఇలాంటి క్షణాల కోసం ఎదురుచూస్తున్నాను. ఈ క్షణాల కోసం, మీ అందరినీ అలరించడానికి, ఇలాంటి స్పందన చూడటానికి నేను చాలా కష్టపడుతున్నాను. మీ స్పందనకు చాలా థ్యాంక్స్. ఇలాంటి ఐకానిక్ సినిమాలో నన్ను భాగం చేసినందుకు మా డైరెక్టర్ కు కృతజ్ఞతలు" అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

 మరో పదేళ్లు ఉపయోగపడుతుంది..

మరో పదేళ్లు ఉపయోగపడుతుంది..

తాను ఎప్పుడు గ్రౌండ్ టు ఎర్త్ ఉంటానని చెప్పిన రామ్ చరణ్.. "నేను ఒక మగధీర అప్పుడు విద్యార్థినే, ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలోనూ విద్యార్థినే. రాజమౌళి ఒక ప్రిన్సిపాల్ లాంటివారు. టీచర్ లాంటి వారు. ఇది సరదాకి అనట్లేదు. నిజంగానే నేను ఆయన్ను కలిసిన ప్రతిసారీ నాకు చాలా జ్ఞానాన్ని అందించేవారు. ఒక క్రాఫ్ట్ ఎలా చేయాలో, అర్థం చేసుకోవడంలో నాకు ఆయన ప్రసాదించిన జ్ఞానం నాకు మరో 10 ఏళ్లు ఉపయోగపడుతుంది" అని తెలిపాడు.

అలా సులువుగా ఉంటుంది..

జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. "తారక్ నేను ఇద్దరం చాలా క్లోజ్ అయ్యాం. అందుకు RRRకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. పలు కారణాల వల్ల మేము ఎక్కువగా కలవలేకపోయినప్పటికీ మేము చాలా దగ్గరయ్యాం. మా బంధం చూసే రాజమౌళి మాకు ఇలా నటించండి అని రాజమౌళి అన్నారు. ఎందుకంటే ఇలా అయితే స్నేహబంధం, సోదరభావం చూపించడం సులువుగా ఉంటుంది" అని పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X