RC 15 రిలీజ్ పై స్పందించిన రామ్ చరణ్.. ఆ కల నిజమైంది అంటూ..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల పాటు అగ్ర హీరోలు వెండి తెరపై కనిపించలేదు. ఇక రానున్న రెండేళ్లలో మాత్రం వీలైనంత ఎక్కువ గా అభిమానులను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఒకప్పుడు ఏడాదికి ఒక్క సినిమా చేసే హీరోలు ఇప్పుడు మాత్రం ఒకే సారి రెండు మూడు సినిమాల్లో లైన్ లో పెడుతుండడం విశేషం. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా వరుస సినిమాలతో రాబోతున్నట్లు అర్థమవుతుంది. రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న RRR సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ఆ సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లు సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. మెగా నందమూరి హీరోల కలయికలో వస్తున్న ఈ మొట్టమొదటి మూవీపై అన్నివర్గాల ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా కూడా భారీ స్థాయిలో ఉండాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక RRR సినిమా అనంతరం రామ్ చరణ్ తేజ్ తన 15 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. RC 15 ప్రాజెక్టుగా తెరపైకి రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి.

Ram charan about shankar project RC 15 release date

ఇప్పటికే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నట్లు అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇక అవన్నీ నిజమేనని రామ్ చరణ్ కూడా వివరణ ఇచ్చాడు. ఇటీవల ఒక నేషనల్ మీడియా ముందుకు వచ్చిన రామ్ చరణ్ తేజ్ రాబోయే శంకర్ ప్రాజెక్టు పై తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. నా జీవితంలో ఎప్పటినుంచో శంకర్ గారితో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. ఇక 15 ప్రాజెక్టుతో ఆ కల నిజం కాబోతోంది అని తెలియజేశాడు. ఇక ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని విషయంలో కూడా చరణ్ వివరణ ఇచ్చాడు. 2023 ఫిబ్రవరిలో RC 15 వ ప్రాజెక్టు విడుదల కానున్నట్లు తెలియజేశాడు.

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందని సినిమా పొలిటికల్ డ్రామా తెరకెక్కుతున్నట్లు తెలియజేశాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో జి స్టూడియోస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. ఇక RRR సినిమా గురించి కూడా రామ్ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. నేను ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నాను. ఆ పాత్రలో మూడు విభిన్నమైన రకాల షేడ్స్ కనిపిస్తాయి అని అన్నాడు. అంతేకాకుండా రాజమౌళితో వర్క్ చేస్తే నటుడిగా ఎంతగానో నేర్చుకోవచ్చు అని కూడా రామ్ చరణ్ తెలియజేశాడు. ఇక సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X