చిరంజీవి - జగన్ భేటీకి రామ్ చరణ్ గైర్హాజరు..? ఎక్కడా కనిపించని చెర్రీ!
Recommended Video
మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో సోమవారం (అక్టోబర్ 14) మధ్యాహ్నం భేటీ అవుతున్నారు. తొలుత లంచ్ సమావేశానికి చిరుతో పాటు రామ్ చరణ్ హాజరవుతారని భావించారు. కానీ ఈ భేటీలో చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, జగన్, ఆయన సతీమణి భారతి పాల్గొన్నారు. రామ్ చరణ్ గైర్హాజరవుతున్నారని సమాచారం. హెలి ప్యాడ్ వద్ద చిరంజీవి, సురేఖ మాత్రమే కనిపించారు. ఈ నేపథ్యంలో చెర్రీ గైర్హాజరవుతున్నట్లుగా భావిస్తున్నారు.
చిరంజీవి దంపతులు మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వీరిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేయడం, ఇప్పుడు ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఏపీలో జనసేన పార్టీ తరఫున ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది కేవలం సినిమా పరిధికి లేదా మర్యాదపూర్వకం మాత్రమేనని చెబుతున్నారు.

కర్నూలు జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా చిరంజీవి హీరోగా సైరా సినిమా తెరకెక్కింది. అక్టోబర్ 2వ తేదీన విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా హిట్ అయిన నేపథ్యంలో చిరంజీవి ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళసాయిని కలిశారు. ఇప్పుడు జగన్‌తో భేటీ అవుతున్నారు. అసలు అక్టోబర్ 11వ తేదీన కలవాల్సి ఉంది. ఆ తర్వాత ఈ రోజుకు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











