Ram Charan Allu Arjun: ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్-అల్లు అర్జున్.. మెగా కజిన్స్ తో కలిసి అలా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామీల్లో ఒకటి మెగా ఫ్యామిలీ. మెగాస్టార్ చిరంజీవి నుంచి అల్లు శిరీష్ వరకు ఒకే ఫ్రేమ్ లో కనపడితే వచ్చే ఆ కిక్కే వేరు. అయితే తాజాగా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కాకున్నా మెగా కజిన్స్ అందరూ కలిసి అభిమానులకు పండుగ వాతావరణం తీసుకొచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరూ తమదైన స్టైల్ లో చిత్రాలతో, పవర్ ఫుల్ యాక్టింగ్ తో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ఈ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో దర్శనమిస్తే అభిమానులకు కన్నులపండుగగా ఉంటుంది. తాజాగా బన్నీ, చెర్రీతో పాటు మెగా కజిన్స్ అందరూ ఒక ఫొటోల దర్శనమిచ్చి కనువిందు చేశారు.

అందరూ కలిసి సెలబ్రేషన్స్..

అందరూ కలిసి సెలబ్రేషన్స్..

పండగలు, స్పెషల్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే మెగా ఫ్యామిలీ అంతా ఒక్క చోట చేరుతుంది. అప్పుడప్పుడు మెగా, అల్లు ఫ్యామిలీలు కలిసి మరి పండుగలను సెలబ్రేట్ చేసుకుంటాయి. ఇక ఫ్రెండ్స్ కి మించిన బాండింగ్ తో మెగా కజిన్స్ ఉంటారు. ప్రత్యేక సందర్భాలు ఏం ఉన్నా అదరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు.

ఎప్పటిలానే ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా మెగా కజిన్స్ ఒక చోట చేరారు. క్రిస్మస్ కి ముందుగా సీక్రెట్ శాంటాగా గిఫ్టులు ఇచ్చుకున్నారు. తాజాగా దిగిన ఈ ఫొటోలను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. రామ్ చరణ్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను ట్యాగ్ చేస్తూ ఫొటోలు పంచుకున్నారు.

సీక్రెట్ శాంటా వేడుకల్లో..

సీక్రెట్ శాంటా వేడుకల్లో..

మెగా డాటర్ ఉపాసన కొణిదెల తాజాగా షేర్ చేసిన ఈ ఫొటోలో రామ్ చరణ్, అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీలోని యంగ్ హీరోలు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి ధరణ్ తేజ్, అల్లు శిరీష్, పంజా వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, మెగా బ్రదర్ నాగబాబు గారాల పట్టి నిహారిక కొణిదెల, మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు సుష్మిత, శ్రీజతోపాటు మిగతా కజిన్స్ కూడా ఉన్నారు.

వీరందరూ కలిసి సీక్రెట్ శాంటా క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. కొంతమంది నిలుచుని ఉంటే బన్నీ, అల్లు శిరీష్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, శ్రీజ కింద కూర్చుని ఫొటోకు పోజు ఇచ్చారు. రామ్ చరణ్ చేతిలో ఉన్న పెట్ డాగ్ సైతం అట్రాక్ట్ చేసేలా ఉంది.

రెండు సినిమాలతో..

రెండు సినిమాలతో..

ఇదిలా ఉంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీలోని హీరోలందరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వాటిలో కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఇక మరొకటి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సెట్స్ పై ఉంది.

ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇదే కాకుండా డైరెక్టర్స్ హరీష్ శంకర్, సుజీత్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ అయితే స్టార్ డైరెక్టర్ శంకర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ పుష్ప 2 కోసం రెడీ అవుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X