RRR లీక్స్ : రామ్ చరణ్, అలియా భట్ లుక్ వైరల్.. నెటిజన్స్ ఫిదా
Recommended Video

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత భారీ మల్టీ స్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో తీస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ వైపు షూటింగ్, మరో వైపు హీరోలకు గాయాలు, ఇంకోవైపు వాయిదాలు ఇలా ఆర్ఆర్ఆర్‌ను ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టుగా లొకేషన్స్ నుంచి లీకులు ఊపిరిసలపనివ్వడం లేదు రాజమౌళిని.

మొదటి నుంచి లీకులే..
ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను ఎంత పకడ్బంధీగా నిర్వహించినా.. లీకులు మాత్రం తప్పడం లేదు. అయితే ఈ లీకులన్నీ కూడా ఎన్టీఆర్‌కు సంబంధించినవే. ఆ మధ్య అరుకు అటవీ ప్రాంతంలో కొమురం భీమ్ గెటప్‌లో ప్రజలకు ఉపన్యాసం ఇస్తున్న ఓ వీడియో లీకైంది. అప్పట్లో అది పెద్ద సంచలనంగా మారింది.

తాజాగా యాక్షన్ సీక్వెన్స్..
వికారాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో మళ్లీ ఎన్టీఆర్‌కు సంబంధించిన లుక్స్ లీకయ్యాయి. పులితో భీకరమైన పోరు చేసే ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోవడం తెగ వైరల్ అయింది. మళ్లీ ఈ మూవీ నుంచి రామ్ చరణ్, అలియా భట్ లుక్ ఇదేనంటూ ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది.
వైరలవుతోన్న లుక్స్..
ఆర్ఆర్ఆర్‌లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, సీత పాత్రలో అలియాభట్ నటిస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇంత వరకు వీరద్దరి సీన్స్‌కు సంబంధించిన షూటింగ్ జరగనే లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగణ్, సముద్రఖని సీన్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఓ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అయి ఉంటుందని కొందరు కొట్టిపారేస్తున్నారు.

మళ్లీ గాయాలపాలైన చెర్రీ..
ఆర్ఆర్ఆర్ పుణ్యమా అంటూ అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ గాయాల పాలవుతూనే ఉన్నారు. వీటి వల్ల షూటింగ్ ఆలస్యమవుతూనే ఉంది. మొదట ఎన్టీఆర్ చేతికి గాయం కాగా, ఆపై కాలికి కూడా గాయమైంది. అలానే రామ్ చరణ్‌కు కూడా గాయాలలు అయ్యాయి. తాజాగా చెర్రీ చేతికి మళ్లీ గాయమైనట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











