RC16: డేట్ ఫిక్స్ చేసిన రామ్ చరణ్.. మెగా ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే సర్‌ప్రైజ్

టాలీవుడ్‌లో ఉన్న చాలా మంది హీరోలు పాన్ ఇండియా బాట పడుతున్నారు. అలా ఇప్పటికే కొందరు నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ రేంజ్‌ను చేరుకున్నారు. అందులో గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ ఒకడు. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. ఫాలోయింగ్, మార్కెట్‌ను కూడా పెంచుకున్నాడు. తద్వారా ఫుల్ జోష్‌తో సాగిపోతున్నాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్నారు. ఇది పూర్తి కాకుండానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబు సనతో చేస్తున్నట్లు ప్రకటించాడు.

Ram Charan and Buchi Babu Sana Movie Starts From March 20th

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన తెరకెక్కించే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చేసింది. అంతేకాదు, ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. గేమ్ చేంజర్ షూట్ పూర్తైన వెంటనే ఈ మూవీ షురూ కాబోతుంది.

యూనివర్శల్ సబ్జెక్టుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన సెటప్‌ను బుచ్చిబాబు సన వేగంగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ఇప్పటికే బాండెడ్ స్క్రిప్టును రెడీ చేయడంతో పాటు మిగిలిన అన్నింటినీ రెడీగా పెట్టుకున్నాడు. సరైన ముహూర్తానికి దీన్ని మొదలు పెట్టాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

హై రేంజ్‌లో రూపొందుతోన్న ఈ సినిమాను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27వ తేదీన మొదలు పెడతారని ప్రచారం జరుగుతోంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని మార్చి 20నే ప్రారంభించబోతున్నారట. హైదరాబాద్‌లో ఆరోజు పూజా కార్యక్రమాలు జరపడంతో పాటు ప్రెస్‌మీట్ కూడా నిర్వహించబోతున్నారని తాజాగా తెలిసింది.

Ram Charan and Buchi Babu Sana Movie Starts From March 20th

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కలయికలో రాబోయే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X