Wayanad tragedy: వాయనాడ్ బాధితులకు చిరంజీవి, రాంచరణ్ భారీ విరాళం.. ఆర్థికసాయం ఎంతంటే?
కేరళలో వరదలు ప్రజల జీవన విధానాన్ని అతలాకుతలం చేసింది. వాయనాడ్ ప్రాంతాన్ని ఆకస్మాత్తుగా వరదలు ముంచెత్తడంతో జన జీవనం స్తంభించింది. భవిష్యత్ కోసం ప్రజల్లో బెంగ మొదలైంది. ఊహించని పరిణామంతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. అలాంటి విషాదంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు అండగా, మానసిక స్థైర్యాన్ని అందించేందుకు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్ భారీ విరాళం ప్రకటించారు. మెగా సాయానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
వాయనాడ్ ప్రజల దీన స్థితి చూసి చిరంజీవి తల్లడిల్లిపోయారు. ప్రజలు ఆపదలో ఉన్నారంటే.. తాను ఉన్నానని ముందుకు వచ్చే ఆయన తన వంతుగా వారికి మానసిక స్థైర్యం అందించడానికి తన వంతు సహకారం అందించేందుకు నడుం కట్టారు.

కేరళను వరదలు ముంచెత్తడంతో వందలాది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. గత కొద్దిరోజులుగా చూస్తున్న పరిస్థితి చూస్తే అత్యంత దిగ్బ్రాంతి కరంగా అనిపించింది. వారి బాధను చూసి తట్టుకోలేకపోయాను అని చిరంజీవి ఓ ప్రకటనలో తెలిపారు.
వాయనాడ్ వరద బీభత్సం చూసి నా గుండె తురుక్కుపోయింది. వాయ్‌నాడ్ ప్రజలకు అండగా నిలువాలని నేను, చరణ్ ముందుకు వచ్చారం. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మా తరఫున 1 కోటి రూపాయల విరాళం ప్రకటిస్తున్నాం. బాధితులకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నాం. ఈ విషాదం నుంచి వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన చేశారు.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను భారీగా చిత్రీకరిస్తున్నారు. స్టంట్ మాస్టర్ అని అరసు పర్యవేక్షణలో గ్రాండ్‌గా కనివినీ ఎరుగని రీతిలో షూట్ చేస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి 2025 కి రిలీజ్ కానున్నది.


Click it and Unblock the Notifications











