For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘ఆచార్య’ నుంచి సర్‌ప్రైజింగ్ లీక్: అందులో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఇరగదీసేశారట

  |

  కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అప్పటి హీరోల మాదిరిగా.. నేటి తరం స్టార్లు వీటి విషయంలో సుముఖంగా ఉండడంతో పాటు ఫ్యాన్స్ అభిరుచి కూడా మార్పు రావడంతో అలాంటి సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. దీనికితోడు ఈ మధ్య కాలంలో ఇలా వచ్చిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో మరిన్ని చిత్రాలు పట్టాలెక్కేశాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మెగా హీరోలు ఇద్దరూ కలిసి నటిస్తోన్న చిత్రమే 'ఆచార్య'. కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు.

  మహేశ్ బాబుపై శ్రీరెడ్డి సెక్సీ కామెంట్స్: ఫొటోను షేర్ చేసి మరీ ఘాటుగా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

  'ఆచార్య' మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇది కాస్తా చాలా రోజుల పాటు వాయిదా పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలైంది. అంతలో సెకెండ్ వేవ్ రావడంతో మళ్లీ చిత్రీకరణకు బ్రేక్ పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే బ్యాలన్స్ పార్ట్‌ కోసం చిత్రీకరణను పున: ప్రారంభించారు. ఆ వెంటనే దాన్ని కూడా కంప్లీట్ చేసేసి.. ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తైందని అధికారికంగా ప్రకటించారు. అయితే, కొన్ని పాటలు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయని తెలిపారు. ఇక, ఇటీవలే మళ్లీ షూటింగ్ మొదలెట్టారు.

  Ram Charan and Chiranjeevi Song Highlight in Acharya

  కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో 'ఆచార్య' మూవీ బ్యాలెన్స్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొంటున్నాడు. వీళ్లిద్దరి డేట్స్‌ ప్రకారం షూటింగ్‌ను జరుపుతున్నారు. ఇప్పటికే ఇందులో చిరంజీవి చేయాల్సిన పార్ట్ అయిపోయింది. ఇక, రామ్ చరణ్‌కు సంబంధించిన కొన్ని సీన్స్‌తో పాటు ఓ సాంగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి కూడా అయిపోతే చిత్ర యూనిట్ గుమ్మడి కాయ కొట్టేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో 'ఆచార్య' మూవీ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.

  Bigg Boss: షోలో ఆ హీరోను అవమానించిన నాగార్జున.. స్టేజ్ మీదే ఆమెతో అలా చేయడంతో విమర్శలు

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'ఆచార్య' మూవీలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి చేసే ఓ సాంగ్ ఉంటుందట. ఫుల్ మాస్ బీట్‌తో వచ్చే ఈ పాటలో ఇద్దరూ అదిరిపోయే స్టెప్పులతో రచ్చ రచ్చ చేసేశారని తెలుస్తోంది. మూవీ మొత్తంలో ఈ సాంగ్ ఎంతో హైలైట్ అవబోతుందట. మణిశర్మ మాస్ బీట్‌కు మెగా హీరోలు వేసిన స్టెప్పులు కేకలు వేయిస్తాయని తెలుస్తోంది. ఇక, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫ్ శేఖర్ మాస్టర్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాల్లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేశాడు. దీంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లైంది.

  Ram Charan and Chiranjeevi Song Highlight in Acharya

  మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న 'ఆచార్య' కొరటాల శివ గత చిత్రాల మాదిరిగానే సందేశాత్మకంగా సాగే చిత్రమని తెలుస్తోంది. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి దీన్నీ చిత్రీకరిస్తున్నారు. ఇందులో చరణ్, చిరంజీవి ఇద్దరూ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఓ మిషన్‌లో భాగంగా సిద్ధ పాత్ర చనిపోతే.. ఆచార్య దాన్ని కంప్లీట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మెగా మల్టీస్టారర్‌గా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

  English summary
  Megastar Chiranjeevi - Ram Charan Upcoming Film is Acharya. This movie directed by Koratala Siva. Ram Charan and Chiranjeevi Song Highlight in This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X