ఉపాసన డెలివరీపై రూమర్లు.. రూమర్లకు తెరదించిన రాంచరణ్, వైద్యులు
మెగా పవర్ స్టార్ రాంచరణ్ అంతర్జాతీయ వేదికలపై దుమ్ము రేపుతున్నాడు. RRR అవార్డుల ఫంక్షన్లలో, అలాగే అమెరికాలోని పాపులర్ టాక్ షోలో పాల్గొని గ్లోబల్ స్టార్‌గా మారిపోయారు. ఇలా బీజీగా ఉంటూనే గర్బవతి అయిన భార్య ఉపాసన కొణిదెల ఆరోగ్యంపై జాగ్రతలు తీసుకొంటున్నాడు. ఇలా మల్టీపుల్ టాస్కులతో రాంచరణ్ మరింత పరిణతిని కనబరుస్తున్నాడు. అయితే ఉపాసన కొణిదెల ప్రసవంపై ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లకు గట్టిగానే సమాధానం చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే..

గుడ్ మార్నింగ్ టాక్ షోలో
గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో వరల్డ్ క్లాస్ గైనకాలజిస్ట్ జెన్నిఫర్ ఆష్టన్‌తో మాట్లాడుతూ.. నా భార్య డెలివరీకి రెడీ అవుతున్నది. మీరు నా భార్య ప్రసవానికి సహకారం అందిస్తారా? మాతో పాటు పలు దేశాల్లో పర్యటనకు వస్తారా? అని అడిగారు. అంతేకాకుండా అపోలో హాస్పిటల్‌లో భాగస్వామ్యమై సేవలు అందించాలని కోరారు.

వరల్డ్ క్లాస్ గైనకాలజిస్టుతో
అయితే గైనకాలజిస్టు జెన్నీఫర్‌కు రాంచరణ్ చేసిన ప్రపోజల్‌లో ఉపాసన కూడా స్పందించారు. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో పనిచేసే ఇద్దరు డాక్టర్లతో కలిసి నాకు హెల్ప్ చేయాలి. నా ప్రసవానికి సంబంధించి జాగ్రత్తలు చూసుకోవాలని ట్విట్టర్ ద్వారా ఉపాసన రిక్వెస్ట్ చేసింది.

నా భార్య అమెరికాలో
అయితే ఉపాసన, రాంచరణ్ చేసిన రిక్వెస్ట్‌కు జెన్నిఫర్ ఆష్టన్ సానుకూలంగా స్పందించింది. దాంతో మిమ్మల్ని కలుసుకోవడం చాలా గర్వంగా ఉంది. నేను మీ ఫోన్ నంబర్ తీసుకొంటాను. నా భార్య అమెరికాకు వస్తుంది. మీరు ఆమె గురించిన కేర్ తీసుకోవాలి. నా మొదటి బిడ్డకు మీరు పురుడు పోయడం నాకు గర్వంగా ఉంటుంది అని రాంచరణ్ కోరారు.

ఉపాసన డెలివరీపై రూమర్లు
అయితే రాంచరణ్, ఉపాసన దంపతులు తమ బిడ్డకు అమెరికాలో జన్మనిచ్చేలా ప్లాన్ చేశారు. అమెరికాలోనే ఉపాసన డెలివరీ ఉంటుందనే వార్తలు సోషల్ మీడియాలో కనిపించాయి. పలు రకాల రూమర్లు కూడా మీడియాలో వ్యాపించాయి. తాను నా దేశంలోనే నా బిడ్డకు జన్మిస్తాను అని చెప్పింది. దాంతో ఆ వార్తలకు తెర దించేలా జెన్నిఫర్, ఉపాసన క్లారిటీ ఇచ్చారు.

గైనకాలజిస్టు జెన్నిఫర్ ఆష్టన్ క్లారిటీ
ఉపాసన రిక్వెస్ట్‌కు గైనకాలజిస్టు జెన్నిఫర్ ఆష్టన్ జవాబిస్తూ.. మీ బిడ్డకు మీ దేశంలోనే డెలివరీ చేయడం నాకు గర్వంగా ఉంది. ఉపాసనకు సంబంధించిన హాస్పిటల్‌లోనే డెలివరీ చేసే అవకాశం రావడం నిజంగా సంతోషంగా ఉంది. అపోలో డాక్టర్లు సుమన మనోహర్, రూమా సిన్హాతో కలిసి ఉపాసన ప్రసవం సురక్షితంగా జరిగేలా చూసుకొంటాం అని జెన్నీఫర్ వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











