Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ లో కీలక మార్పు!

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ భారీ బడ్జెట్ మూవీ జనవరి 10న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ పాన్ ఇండియా మూవీ మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది గేమ్ ఛేంజర్. అయితే.. ఈ తరుణంలో గేమ్ చేంజర్ మూవీ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇంతకీ ఆ మార్పేంటీ? ఆ నిర్ణయంతో గేమ్ చేంజర్ మూవీ కలెక్షన్స్ పై ఏమైనా ప్రభావం చూపుతుందా? ఓ లూక్కేయండి.

దర్శక ధీరుడు రాజమౌళి RRR మూవీ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించడం, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఫస్ట్ టైం తెలుగులో స్ట్రెయిట్ మూవీ తీయడంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి డైరెక్టర్ శంకర్ గత సినిమాలు వరుసగా ఫ్లాప్స్ కావడంతో ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుని గేమ్ చేంజర్ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించగా.. అంజలి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు.

Ram Charan and Kiara Advani s Game Changer movie makers added Naanaa Hyraanaa song in theaters from today

డైరెక్టర్ శంకర్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మేనియాతో గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ హై రేంజ్లోనే జరిగింది. రిలీజ్ ముందు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లు రామ్ చరణ్ మూవీపై భారీ అంచనాలు నెలకునేలా చేశాయి. అంతేకాదు.. సోలోగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో రికార్డు స్థాయి బిజినెస్‌గా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. తొలిరోజు గేమ్ చేంజర్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయితే.. గేమ్ ఛేంజర్ రిలీజ్ మొదటి రోజు మూవీలోని 'నా నా హైరానా' పాట కనిపించకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే, పలు సాంకేతిక కారణాల వల్లే 'నా నా హైరానా' పాటను తెలిగించాల్సి వచ్చిందని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. కానీ, ఆ పాటను జనవరి 14 నుంచి థియేటర్లలో యాడ్ చేస్తామని మూవీ మేకర్స్ ముందుగా ప్రకటించారు.

కానీ, తాజాగా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. మూవీ మేకర్స్ ప్రకటించి దాని కంటే.. ముందుగానే 'నానా హైరానా' పాటను యాడ్ చేసి రామ్ చరణ్ అభిమానలకు గేమ్ ఛేంజర్ టీమ్ గుడ్ న్యూస్ తెలిపింది. అంటే.. నేటి (జనవరి 12) నుంచి ఈ పాటను థియేటర్లో చూడవచ్చు. ఈ మేరకు గేమ్ ఛేంజర్ సినిమాలో నానా హైరానా పాటను యాడ్ చేసినట్టుగా మూవీమేకర్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే, గేమ్ ఛేంజర్ సినిమాలోని నాలుగు పాటలకే దాదాపుగా రూ. 75 కోట్ల వరకు ఖర్చు అయిందని జోరుగా వార్తలు వినిపించాయి.

Ram Charan and Kiara Advani s Game Changer movie makers added Naanaa Hyraanaa song in theaters from today

అందులో నానా హైరానా పాటకు రూ. 25 కోట్లకు పైగా ఖర్చు చేశారని బాలీవుడ్ టాక్. ఇన్ని కోట్లు పెట్టిన పాటను రూపొందించి సినిమాలో ఎందుకు పెట్టలేదనీ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఈ సాంగ్ ను సినిమాలో యాడ్ చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: ram charan game changer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X