Game Changer: ఆ డైరెక్టర్‌తో రామ్ చరణ్ ఫైటింగ్.. అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే

టాలీవుడ్‌లో ప్రస్తుతం చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే గ్లోబల్ రేంజ్‌ను సొంతం చేసుకున్నారు. అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. పేరుకు మెగాస్టార్ చిరంజీవి కుమారుడే అయినా తనదైన నటనతో తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగాడు. అంతేకాదు, RRR (రౌద్రం రుధిరం రణం) అనే మూవీతో చరణ్ మరో ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. దీనితో పాటు గ్లోబర్ స్టార్‌ అనే పేరును కూడా సొంతం చేసుకున్నాడు. ఈ జోష్‌తోనే మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాడు.

ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడో మొదలైనా మధ్యలో చాలా అవాంతరాలు ఎదురు అయ్యాయి. దీంతో ఇప్పటికీ దీనికి సంబంధించిన 60 శాతం మాత్రమే టాకీ పార్ట్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేశారు. ఇక, మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. అందుకు అనుగుణంగానే అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

 Ram Charan

పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న 'గేమ్ చేంజర్' చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను జూలై 16వ తేదీ నుంచి మొదలుపెట్టబోతున్నారని తాజాగా ఓ న్యూస్ తెలిసింది. అంతేకాదు, ఇందులో రామ్ చరణ్‌తో పాటు ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్‌జే సూర్య కూడా పాల్గొంటారని సమాచారం. పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో వీళ్లిద్దరి మధ్య ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారని తెలిసింది. ఇక, ఈ మూవీలో ఎస్‌జే సూర్యనే విలన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన పాత్ర వైవిధ్యంగా ఉండబోతుందని టాక్.

ఇక, భారీ బడ్జెట్‌తో వస్తున్న 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే, ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X