RC15: కోనసీమకు రామ్ చరణ్.. ఫేమస్ సిటీలో పోరాటం చేయనున్న మెగా హీరో

టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. అద్భుతమైన టాలెంట్లతో చాలా తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ తొలినాళ్లలోనే ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకుని స్టార్‌డమ్‌ను సైతం అందుకున్నాడు. ఇక అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ మెగా హీరో... ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా కొన్ని హిట్లు కొన్ని ఫ్లాపులతో తన కెరీర్‌ను సాఫీగా సాగిస్తున్నాడు. తద్వారా తన మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడతను.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రుధిరం రణం)లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించాడు. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ఇందులో అతడు అల్లూరిగా, తారక్ కొమరం భీంగా కనిపించనున్నారు. ఈ సినిమా పట్టాలపై ఉన్న సమయంలోనే చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య'లోనూ భాగం అయ్యాడు. ఇందులో ఈ మెగా హీరో నక్సలైట్ సిద్ధ అనే పాత్రను పోషిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు షూటింగ్‌ను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో అతడు ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు.

Ram Charan and S. Shankar Movie New Schedule From February 8th

తనదైన శైలి దర్శకత్వ ప్రతిభతో ఇండియన్ సినీ చరిత్రలోనే దిగ్గజ దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడింది. ఆ వెంటనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా శంకర్ మొదలు పెట్టి.. దాదాపుగా వాటిని పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం దీన్ని అధికారికంగా మొదలు పెట్టేశారు. అప్పటి నుంచి వీలు కుదిరినప్పుడల్లా షెడ్యూళ్లను జరుపుకుంటూ ముందుకు సాగుతున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ గురించి తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఫిబ్రవరి 8వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందట. దీన్ని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్లాన్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో దాదాపు 20 రోజుల పాటు చిత్రీకరణ జరపబోతున్నారని అంటున్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని పోరాట సన్నివేశాలను షూట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో రామ్ చరణ్‌, హీరోయిన్ కియారా అద్వాణీతో పాటు కీలకమైన పాత్రలు చేస్తున్న నటులు కూడా పాల్గొనబోతున్నారని టాక్.

ఈ సినిమా ఒకే ఒక్కడు నేపథ్యంతో సాగే పొలిటిక్ డ్రామా అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇందులో చరణ్ డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోయే ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X