ప్రేమ పాఠాలు చెప్పబోతున్న రామ్ చరణ్: అప్పటి వరకూ ఆమెతో కలిసి అక్కడే ఉంటాడట
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న అతడు.. జాతీయ స్థాయిలో సైతం గుర్తింపును దక్కించుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం అతడు పలు భారీ ప్రాజెక్టుల్లో భాగం అయ్యాడు. అవి ప్రేక్షకుల ముందుకు రాకుండానే ఇప్పుడు దిగ్గజ దర్శకుడు శంకర్‌తో మరో సినిమాను మొదలు పెట్టేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా చరణ్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం!

రెండు భారీ చిత్రాల్లో భాగమైన చరణ్
ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం)లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు రామ్ చరణ్. టాలీవుడ్ హిస్టరీలోనే భారీ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఇందులో అతడు అల్లూరిగా, తారక్ కొమరం భీంగా కనిపించనున్నారు. దీనితో పాటు చిరంజీవి నటిస్తోన్న 'ఆచార్య'లోనూ నక్సలైట్ పాత్రను చేశాడు. ఇవి చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి.

లెజెండరీ దర్శకుడితో చరణ్ మూవీ
RRR, ఆచార్య తర్వాత రామ్ చరణ్ నటించబోయే ప్రాజెక్టు గురించి చాలా కాలంగా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఎంతో మంది దర్శకులు పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఊహించని విధంగా చెర్రీ.. దిగ్గజ దర్శకుడు శంకర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ భారీ రేంజ్‌లో రూపొందనుంది.

అప్పుడే కంప్లీట్.. ఎవరు వచ్చారంటే
రామ్ చరణ్‌తో చేసే సినిమా కోసం డైరెక్టర్ శంకర్ ప్రీ ప్రొడక్షన్ పనులను చాలా వేగంగానే పూర్తి చేశారు. ఆ వెంటనే ఆయన ఈ మూవీ కాస్టింగ్ మీద దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ చిత్రం కోసం జయరాం, శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులను ఎంపిక చేశారు. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్‌గా థమన్, హీరోయిన్‌గా కియారా అద్వాణీని తీసుకున్న విషయం తెలిసిందే.

భారీగా ప్రారంభం... ఫస్ట్‌ది పూర్తైంది
రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే అంగరంగ వైభవంగా జరిగాయి. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. దీంతో ఇది నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ అయింది. ఇక, ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను కూడా దిగ్విజయంగా పూర్తి చేసేసుకుంది.

ప్రేమ పాఠాలు చెప్పబోతున్న చరణ్
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని హైరేంజ్‌లో తెరకెక్కించేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం రామ్ చరణ్ కూడా పూర్తిగా సహకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం మెగా హీరో ప్రేమ పాఠాలు చెప్పబోతున్నాడని ఓ న్యూస్ లీకైంది.
Recommended Video

అప్పటి వరకూ ఆమెతో కలిసి అక్కడే
భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ నవంబర్ 15 అంటే సోమవారం నుంచి ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న ఈ షెడ్యూల్‌లో చరణ్, కియారాపై లవ్ సీన్స్ తీయబోతున్నారట. ఇందులోనే ఓ పాటను కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ మొత్తం వీళ్లిద్దరి మీదే జరగబోతుందని సమాచారం.


Click it and Unblock the Notifications











