RC15: రామ్ చరణ్ మూవీ యూనిట్ కీలక ప్రకటన.. కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'వినయ విధేయ రామ' మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దీని తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం RRR (రౌద్రం రుధిరం రణం)లో భాగం అయిన అతడు.. దీని కోసం చాలా కాలమే కేటాయించాడు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఆచార్య'లోనూ ఈ మెగా హీరో కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే పూర్తి చేసుకున్న అతడు.. ఇప్పుడు తన ఫ్యూచర్ ప్రాజెక్టులపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు.

ప్రస్తుతం రెండు సినిమాలతో రెడీగా ఉన్న రామ్ చరణ్.. తనదైన శైలి డైరెక్షన్‌తో ఇండియన్ సినీ చరిత్రలోనే దిగ్గజ దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రకటన ఎప్పుడో వెలువడింది. ఆ వెంటనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టిన దర్శకుడు.. వాటిని చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం దీన్ని అధికారికంగా మొదలెట్టేశారు. అంగరంగ వైభవంగా ప్రారంభం అయిన ఈ సినిమా.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది.

Ram Charan and S. Shankar Movie Unit Request to All

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత డిసెంబర్‌లోనే ప్రారంభం అయింది. మొదటి షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను రూపొందించారు. దాని తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు రెండో షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్లాన్ చేశారు. అక్కడి గోదావరి పరీవాహక ప్రాంతంలో ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే.

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా సెట్స్ నుంచి ఇటీవలే ఓ ఫొటో బయటకు వచ్చింది. ఇందులో రామ్ చరణ్ క్లీన్ షేవ్‌తో కనిపించాడు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఓ కీలక ప్రకటన చేసింది. అందులో 'రామ్ చరణ్ - శంకర్ కలయికలో రూపొందుతోన్న సినిమా జనావసరం కారణంగా ఓపెన్ ఏరియాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎవరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చట్టవిరుద్ధం. అంతేకాదు, అటువంటి కార్యకలాపాలకు పాల్పడిన వాళ్లపై మా ప్రైవసీ యూనిట్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఎలాంటివి కనిపించినా రిపోర్ట్ చేయండి' అంటూ పేర్కొంది.

Ram Charan and S. Shankar Movie Unit Request to All

ఈ సినిమా పొలిటిక్ ఎలిమెంట్స్‌తో సాగే డ్రామా అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఇందులో చరణ్ డుయల్ రోల్ చేస్తున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోయే ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకాంత్, జయరాం, అంజలి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X