Don't Miss!
- News
గవర్నర్ పై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!?
- Sports
ఇదో చెత్త పిచ్.. టీ20లకు పనికిరాదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Survey 2022లో రాంచరణ్‌కు అల్ టైమ్ హయ్యెస్ట్ ర్యాంక్.. బడా బ్యూటీలకు ధీటుగా సాయి పల్లవి
ఇంటర్నెట్ డిజిటల్ మీడియా సర్వేల ద్వారా ర్యాంక్ లను అనౌన్స్ చేసే ఓరామాక్స్ సంస్థ 2022 ఇండియా మొత్తంలో మోస్ట్ పాపులర్ స్టార్స్ లిస్టును ఎప్పటికప్పుడు ఎనౌన్స్ చేస్తూనే ఉంది. ఇక లిస్టులో అయితే ఆల్ టైం హైయెస్ట్ ర్యాంక్స్ అందుకున్న హీరోను మాత్రమే కాకుండా హీరోయిన్ పేరును కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం వారికి సంబంధించిన టాపిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక డిసెంబర్ లో కూడా ఎవరెవరు ఏ ర్యాంక్స్ అందుకున్నారు అలాగే 2022లో ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకున్న స్టార్స్ వివరాల్లోకి వెళితే..

దేశవ్యాప్తంగా మన స్టార్స్ క్రేజ్
2002 లో చాలామంది టాలీవుడ్ తారలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. మన స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ ఉండడంతో బాలీవుడ్ హీరోలకు దీటుగా సర్వేలలో అయితే మంచి ర్యాంక్స్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా అందులో ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అలాగే మహేష్ బాబు పేర్లు ఎక్కువగా వైరల్ అయ్యాయి.

ఆ హీరోలు కూడా..
ఇక టాప్ లిస్టులో అయితే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న వారు మాత్రమే కాకుండా అత్యధిక మార్కెట్ ఉన్నటువంటి మహేష్ బాబు పవన్ కళ్యాణ్ పేర్లు కూడా ఈ సర్వేలో హాట్ టాపిక్ గా నిలిచాయి. ఇక యువ హీరోలు నాని విజయ్ దేవరకొండ కూడా లిస్టులో పోటీపడ్డారు. ఇక మాస్ మహారాజ రవితేజ చిరంజీవి పేర్లు కూడా వైరల్ అవుతుంలన్నాయి.

హీరోయిన్స్ డామినేషన్
ఇక 2022లో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రకారం చూసుకుంటే కొంతమంది హీరోయిన్స్ ఒరామాక్స్ సర్వేలో కొందరిని డామినేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా సమంత కాజల్ అగర్వాల్ సాయి పల్లవి అయితే టాప్ లిస్టులో కొనసాగుతూ వచ్చారు. ఇక అనుష్క శెట్టి, రష్మిక మందన్న, పూజా హెగ్డే, కీర్తి సురేష్ పేర్లు కూడా ఈ సర్వేలో బాగానే వైరల్ అయ్యాయి. ఇక బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి కూడా టాప్ హీరోయిన్స్ కి పోటీని ఇచ్చే ప్రయత్నం చేసింది.
|
రామ్ చరణ్ హయ్యెస్ట్ ర్యాంక్
అయితే 2022లో మొత్తంగా ఎక్కువసార్లు ఎక్కువ ర్యాంక్స్ సొంతం చేసుకున్న టాలీవుడ్ స్టార్స్ లో రామ్ చరణ్ నిలిచాడు. రామ్ చరణ్ గత ఏడాది RRR సినిమాతోనే కాకుండా ఆచార్య సినిమాతో కూడా హాట్ టాపిక్ గా నిలిచాడు. అలాగే తన 15వ సినిమాకు సంబంధించిన విశేషాలు కూడా బాగానే వైరల్ అయ్యాయి. ఇక ఆల్ టైం హైయెస్ట్ ర్యాంక్స్ లలో రామ్ చరణ్ మూడవ స్థానంలో ఎక్కువ స్థాయిలో క్రేజ్ అందుకుంటూ వచ్చాడు.
|
సాయి పల్లవి హయ్యెస్ట్ ర్యాంక్
ఇక ఆల్ టైం హైయెస్ట్ ర్యాంక్స్ తెలుగులో నుంచి ఎక్కువ స్థాయిలో మూడవ ర్యాంక్ అందుకున్న వారిలో సాయి పల్లవి నిలిచింది. సాయి పల్లవి సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా సోషల్ మీడియాలో అలాగే డిజిటల్ టెలివిజన్ మీడియాలలో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉంటుంది. ఇక ఆమె 2022లో ఎక్కువసార్లు మూడవ ర్యాంకును సొంతం చేసుకొని మంచి క్రేజ్ అందుకున్న హీరోయిన్ గా నిలిచింది.