Operation Valentine: వరుణ్ తేజ్ కోసం పాన్ ఇండియా స్టార్లు.. రామ్ చరణ్ అలా సల్మాన్ ఖాన్ అలా!

మెగా కాంపౌండ్ నుంచి టాలీవుడ్‌లోకి ఎంతో మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో కొందరు మాత్రమే చాలా విజయాలను అందుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. 'ముకుంద' మూవీతో హీరోగా వచ్చిన అతడు.. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో హిట్లను అందుకున్నాడు. ఫలితంగా మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. అయితే, గత రెండు చిత్రాలు మాత్రం వరుణ్ తేజ్‌కు నిరాశనే మిగిల్చాయి. అయినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతూనే ఉన్నాడు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ తన 13వ సినిమా 'ఆపరేషన్ వాలెంటైన్'ను చేస్తున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వహిస్తోన్న ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రాబోతుంది. ఈ చిత్రం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వార్ బ్యాగ్‌డ్రాప్‌తో తెరకెక్కింది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. దీంతో ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని భావించారు. కానీ, అనివార్య కారణాలతో ఈ చిత్రాన్ని మార్చి 1వ తేదీకి వాయిదా వేసేశారు. దీంతో ఇప్పుడు మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసేసింది.

Ram Charan and Salman Khan To Unveil Varun Tej Starrer Operation Valentine Movie Trailer

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ రూపొందిస్తోన్న 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు శరవేగంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఫిబ్రవరి 20వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, దీన్ని తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, హిందీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఉదయం 11:05 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మూవీ యూనిట్ తాజాగా తెలిపింది. దీంతో ఇది మరింత మందికి రీచ్ అవుతుందని చెప్పొచ్చు.

Ram Charan and Salman Khan To Unveil Varun Tej Starrer Operation Valentine Movie Trailer

ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్- శక్తి ప్రతాప్ సింగ్ హడా కలయికలో రాబోతున్న 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీని సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ రినైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దీన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందించారు. ఇందులో 2017 మిస్ వరల్డ్ మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా నటించింది. అలాగే, రుహానీ శర్మ, నవదీప్ తదితరులు కీలక పాత్రలను చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X