రామ్ చరణ్, సానియా మీర్జా స్టెప్పులు.. ఉపాసన చేసిన పనికి టెన్నిస్ స్టార్ షాక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలు ఒకే చోట కనిపడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. గతంలో వీరి మధ్య ఏదో ఉందన్న వార్తలు కూడా హల్ చల్ చేశాయి. అయితే వీరిద్దరు మంచి స్నేహితులన్న విషయం కొందరికే తెలుసు. ఇరు కుటుంబాలు కూడా కలిసి ఎన్నో ఈవెంట్లలో పాల్గొన్నారు. తాజాగా ఈ మెగా దంపతులు సానియా ఇంట్లో జరిగిన వేడుకకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఘనంగా సానియా సోదరి పెళ్లి..
టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్‌ల వివాహం ఇటీవలే ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ పెళ్లి రిసెప్షన్ గురువారం శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగింది.

ప్రముఖుల హాజరు..
ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు అనేక రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కూడా హాజరయ్యారు.
చేతిలో చేయి వేస్తూ ఫోటోలు..
ఈ పెళ్లి విందులో చరణ్, ఉపాసన సందడి చేశారు. అజహరుద్దీన్ తోనూ చరణ్ దంపతులు ఎంతో హుషారుగా ముచ్చటిస్తూ కనిపించారు. కాగా.. సానియా మీర్జాకు, ఉపాసనకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్న విషయం విదితమే. వీరిద్దరూ ఎప్పటి నుంచో స్నేహితులు. ఇక ఈ ఈవెంట్లో వీరి ఫోటోలు ఎంతగానో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ చేతిలో చేయి వేసిన సానియా మీర్జా ఫోటో హల్ చల్ చేస్తుంది. ఇన నేటి ఉదయం నుంచి ఈ ఫోటో ఎంతగా హాట్ టాపిక్‌గా మారిందో అందరికీ తెలిసిందే.

చిందులు వేసిన చరణ్, సానియా..
ఈ రిసెప్షన్ వేడుకలో రామ్ చరణ్, సానియా కలిసి వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి. వార్ సినిమాలో కే గుంగ్రూ టూట్ గయే అనే పాటకు సానియా, చెర్రీ కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ఉపాసన తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయడం కొసమెరుపు. అయితే ఈ వీడియోను నువ్వు షేర్ చేశావా? నమ్మలేకపోతున్నా అంటూ సానియా రిప్లై ఇచ్చింది.


Click it and Unblock the Notifications











