Ram Charan- Upasana Twins: రామ్ చరణ్- ఉపాసనకు కవల పిల్లలు... ఎన్టీఆర్, టాలీవుడ్ సెలబ్రిటీల విషెస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన దంపతలు కవల పిల్లలకు జన్మనిచ్చారు. మీడియాలో వచ్చిన వార్తలను నిజం చేస్తూ.. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి ఉపాసన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మెగా వారసత్వాన్ని కొనసాగించేలా రామ్ చరణ్‌కు వారసుడొచ్చాడంటూ అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

అపోలో ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉంది. కొణిదెల, కామినేని కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి. రామ్ చరణ్ - ఉపాసన రాత్రి కవలలకు జన్మనిచ్చారు. ఉపాసనతో పాటు బిడ్డలిద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మా ఇంట్లో శుభం కలగాలని ఎప్పటి నుంచో, ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది కోరుకున్నారు. ఆ భగవంతుడి దయతో, హనుమంతుడి కృప వల్ల ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ జన్మించారు. ఆ శుభవార్తను మీ అందరితో పంచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది అని చిరంజీవి అన్నారు.

Ram Charan and Upasana Blessed with Twin Babies Chiranjeevi Jr NTR and other celebs congratulate mega couple

రామ్ చరణ్ ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనివ్వడం పట్ల టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. కవలలకు జన్మనిచ్చిన రామ్ చరణ్, ఉపాసనలకు కంగ్రాట్స్. మీ కుటుంబంలో ప్రేమ, ఆరోగ్యం, సంతోషం ఉండాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు.

రామ్ చరణ్, ఉపాసనలకు హీరో వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి అభినందనలు తెలిపారు. హాయ్ చిట్టి కవలలు.. ఈ ప్రపంచంలోకి మీకు స్వాగతం. ఇప్పటికే మిమ్మల్ని అందరూ ఎంతో ప్రేమిస్తున్నారు. క్లీంకార ఇప్పుడు అఫీషియల్‌గా పెద్దక్కగా ప్రమోషన్ పొందింది. రామ్ చరణ్, ఉపాసనకు కంగ్రాట్స్. మీ చిన్న కజిన్ వాయువ్‌ మీతో కలిసి పెరిగేందుకు ఎదురుచూస్తున్నాడని లావణ్య పోస్ట్ చేసింది.

రామ్ చరణ్, ఉపాసనలకు చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల అభినందనలు తెలిపారు. 2026వ సంవత్సరం ప్రారంభంలోనే తమ కుటుంబానికి ఆనందాన్ని తెచ్చింది. మరోసారి నేను అత్తయ్యని అయ్యాను. రామ్ చరణ్, ఉపాసనలకు కంగ్రాట్స్ అని సుస్మిత కొణిదెల ట్వీట్ చేశారు.

More from Filmibeat

Read more about: ram charan upasana chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X