రైమ్‌కు థాయ్ కట్.. క్లింకారాకు సమ్మర్ కట్.. మరి రామ్ చరణ్, ఉపాసనలు ఎలా ఉన్నారంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల ముద్దుల కూతురు.. మెగా ఫ్యామిలీ వారసురాలు క్లింకారా గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిన్నారి మొహం ఎవరికీ తెలియకపోయినా.. ఇప్పటికే ఈమెకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. మెగా వారసురాలిగా విపరీతమైన క్రేజ్ సంపాధించుకున్న ఈమెకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు కూడా వార్తలుగా మారుతున్నాయి. ఆమె గురించి తెలుసుకోవడానికి అంతా పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజాగా ఈ పాపాయి గుండుతో కనిపించింది. ముఖ్యంగా తొలిసారి పాపకు కటింగ్ చేయించడంతో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.
కేవలం పాపాయికి మాత్రమే కాకుండా.. రామ్ చరణ్ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఆయన శునకం రైమ్ గురించి కూడా అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్, ఉపాసన కొణిదెలతో పాటు ఈ పెంపుడు కుక్క పేరిట కూడా ఓ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉండడం మరింత విశేషం. తనను కూడా తమ బాబులాగే పెంచుకుంటున్న ఈ జంట.. క్లింకారాపై చూపిస్తున్న ప్రేమనే రైమ్ పై కూడా చూపిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్లినా దాన్ని కూడా తీసుకు వెళ్తున్నారు.

ముఖ్యంగా రైమ్ పేరిట క్రియేట్ చేసిన అకౌంట్ లో కూడా వాళ్లు వెళ్లిన ట్రిప్స్ కు సంబంధించిన అన్ని విషయాలతో పాటు ఫొటోలను షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా రైమ్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పలు ఫొటోలు షేర్ చేశారు. అందులో రైమ్ స్విమ్ చేస్తూ కనిపించగా... మరో ఫొటోలో చెర్రీ, ఉపాసనలు.. ఏనుగుకు స్నానం చేయిస్తూ కనిపించారు. ఈ ఫొటోలనే ఉపాసన తన ముద్దులు కూతురు క్లింకారాను ఎత్తుకుని కనిపించింది. అయితే క్లింకారా ఈ ఫొటోలు గుండుతో ఉండగా... అంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు.
పాపాయికి తొలిసారి ఇలా సమ్మర్ లో గుండు కొట్టించడంతో.. ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. క్లింకారాతో పాటు రైమ్ కూడా థాయ్ కట్ లో కనిపించాడు. ఇదే విషయాన్ని రైమ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాలను నేరుగా రైమ్ చెబుతున్నట్లుగానే రాసుకొచ్చారు. చెల్లెలు క్లింకారాతో కలిసి స్యామ్యూయ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేశానని.. సముద్రంలో ఈత కొట్టడం, రెస్క్యూ క్యాంపస్ లో ఏరుగుల రక్షణ గురించి తెలుసుకోవడం ఇష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చారు. అలాగే తన సంరక్షణ, కొత్త థాయ్ కట్ బాగా నచ్చిందని.. తనను బాగా చూసుకున్న వారికి థాంక్స్ చెబుతున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











