ఉపాసన పక్కన ఉండగానే..రామ్ చరణ్ చేతిలో చేయి వేసి పట్టుకున్న సానియా మీర్జా.. సోషల్ మీడియాలో ఫోటో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలకు మధ్య ఉన్న స్నేహబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇరు కుటుంబాలు కూడా కలిసి ఎన్నో ఈవెంట్లలో పాల్గొన్నారు. ఉపాసన, సానియా కూడా మంచి స్నేహితులే. ఇక వీరంతా ఓ ఈవెంట్లో కలిసి పాల్గొంటే అక్కడ అంతా సందడిగా మారాల్సిందే. తాజాగా ఈ మెగా దంపతులు సానియా ఇంట్లో జరిగిన వేడుకకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

సానియా సోదరి పెళ్లి.
టీమిండియా మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనమ్‌ల వివాహం ఇటీవలే ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

గ్రాండ్‌గా రిసెప్షన్..
కాగా ఈ పెళ్లి రిసెప్షన్ గురువారం శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు అనేక రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కూడా హాజరయ్యారు.

చేతిలో చేయి వేస్తూ ఫోటోలు..
ఈ పెళ్లి విందులో చరణ్, ఉపాసన సందడి చేశారు. అజహరుద్దీన్ తోనూ చరణ్ దంపతులు ఎంతో హుషారుగా ముచ్చటిస్తూ కనిపించారు. కాగా.. సానియా మీర్జాకు, ఉపాసనకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్న విషయం విదితమే. వీరిద్దరూ ఎప్పటి నుంచో స్నేహితులు. ఇక ఈ ఈవెంట్లో వీరి ఫోటోలు ఎంతగానో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ చేతిలో చేయి వేసిన సానియా మీర్జా ఫోటో హల్ చల్ చేస్తుంది. పక్కన ఉపాసన ఉండగానే సానియా అంత చనువుగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
Recommended Video

గతంలో కూడా వైరల్..
గతంలో రామ్ చరణ్, ఉపాసన కలిసి హైదరాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీని కూడా సందర్శించారు. అలాగే, న్యూ ఇయర్ రోజున సానియా, ఉసాసన, చెర్రీ మంచుతో ఆటలాడారు. అప్పట్లో వీరి ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











