క్లీంకార ఫేస్ రివీల్ చేసిన రామ్ చరణ్- ఉపాసన... చిరంజీవి మనవరాలు ఎవరి పోలికంటే?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు మెగా అభిమానులకు శనివారం సర్‌ప్రైజ్ ఇచ్చారు. పుట్టినప్పటి నుంచి తమ గారాలపట్టి క్లీంకార ఫేస్‌ను బయటి ప్రపంచానికి చూపించలేదు చరణ్ దంపతులు. దాంతో పాప ఎలా ఉంది? ఎవరి పోలిక అనేది తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ క్లీంకార ఫేస్‌ను రివీల్ చేశారు రామ్ చరణ్ - ఉపాసన. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా మొత్తం క్లీంకార ఫోటోలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి మనవరాలు ఎలా ఉంది? చిన్నారి ఎవరి పోలిక? అనేది పరిశీలిస్తే..

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రిని మించిన తనయుడిగా రుజువు చేసుకున్నారు. తొలి నుంచి క్రీడలంటే ఎంతో ఆసక్తి చూపించే రామ్ చరణ్ .. ఓ స్పోర్ట్స్ క్లబ్ మీటింగ్‌కు వెళ్లగా.. అక్కడే ఉపాసనతో తొలిసారి పరిచయం ఏర్పడింది. భారతదేశంలో అగ్రశ్రేణి హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ చైన్‌లలో ఒకటిగా ఉన్న అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌ అధినేత ప్రతాప్ సీ రెడ్డి మనవరాలే ఉపాసన. అపోలో గ్రూప్‌లో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగానికి ఆమె వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే అపోలో హాస్పిటల్స్ అనుబంధ డిజిటల్ వెల్‌నెస్ ప్లాట్‌ఫాం యూఆర్‌లైఫ్‌కి ఫౌండర్‌గా ఉన్నారు.

Ram Charan and Upasana Reveal Daughter Klin Kaara Konidela s Face on her 3rd Birth Day

రామ్ చరణ్‌- ఉపాసనల అభిరుచులు, ఇష్టాయిష్టాలు కలవడం, వ్యక్తిత్వాలు దగ్గరగా ఉండటంతో వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. అనంతరం పెద్దల అంగీకారంతో 2011 డిసెంబర్ 11న రామ్ చరణ్- ఉపాసనల నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. తర్వాత 2012 జూన్ 14న రామ్ చరణ్ - ఉపాసనల పెళ్లి ఘనంగా జరిగింది. అయితే పిల్లల కోసం వీరిద్దరూ దాదాపు 12 ఏళ్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. చివరికి కోట్లాది మంది అభిమానులు, పెద్దల ఆశీస్సులతో 2023 జూన్‌ 20న ఉపాసన - రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారికి క్లీంకార అనే నామకరణం చేశారు. చిన్నారి పుట్టిన వేళా విశేషంతో మెగా ఫ్యామిలీలో అన్ని శుభాకార్యాలు జరుగుతున్నాయి.

ఇక ఈ ఆనందాన్ని డబుల్ చేస్తూ గతేడాది దీపావళికి రామ్ చరణ్ - ఉపాసనలు మరోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ ఏడాది జనవరి 31న కవల పిల్లలకు ఉపాసన జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వారికి శివరామ్ కొణిదెల, అన్వీరా దేవి కొణిదెల అని నామకరణం చేశారు. అయితే క్లీంకారతో పాటు తమ ముగ్గురు పిల్లల ముఖాలను చరణ్ - ఉపాసన దంపతులు ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. అభిమానులు దీనిపై పలుమార్లు సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని ప్రస్తావించగా.. సమయం వచ్చినప్పుడు తామే చూపిస్తామని వీరిద్దరూ దాటవేశారు.

తాజాగా జూన్ 20న క్లీంకార మూడో పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు రామ్ చరణ్- ఉపాసన. చిన్నారి ఫేస్‌ను రివీల్ చేస్తూ తమ ముద్దుల కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోను ఉపాసన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో క్లీంకారను చరణ్, ఉపాసన ఇరువైపులా ఎత్తుకుని నిలబడ్డారు. ఈ పాప అచ్చుగుద్దినట్లు ఉపాసనలా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. మెగా అభిమానులు తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు.

Read more about: ram charan upasana klin kaara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X