మెగా హీరోతో అనిల్ రావిపూడి.. అనుకోకుండా చెడగొట్టిన మహేష్!
ఈ ఏడాది సరిలేరు నికేవ్వరు సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ F3 ప్రాజెక్టుతో రాబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ దర్శకుడిపై స్టార్ హీరోల కన్ను పడింది. మహేష్ బాబుకి కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన ఇలాంటి దర్శకుడితో తప్పకుండా ఒక సినిమా చేయాలని అటు నందమూరి హీరోలు ఇటు మెగా హీరోలు చర్చలు జరుపుతున్నారట.
అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అనిల్ రావిపూడి ఒక సినిమా చేయనున్నట్లు ఇటీవల ఒక టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ RRRతో బిజీగా ఉండడం వల్ల కాస్త ఆలస్యం అవుతుందని చెప్పడంతో అనిల్ F3 ని సెట్ చేసుకున్నాడు. ఇక ఈ గ్యాప్ లో మహేష్ బాబు అనుకోకుండా ఈ కాంబినేషన్ క్యాన్సిల్ అవ్వడానికి కారణమైనట్లు తెలుస్తోంది.

F3 తరువాత అనిల్.. రామ్ చరణ్ తో చేయాలని అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పట్లో వచ్చేలా లేదని తెలుస్తోంది. ఎందుకంటే చరణ్ RRR తరువాత వంశీ పైడిపల్లి సినిమాను చేసే ఛాన్స్ ఉందట. ఆ కాంబినేషన్ కు మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
అసలైతే వంశీ తన నెక్స్ట్ సినిమాను మహేష్ బాబుతోనే అనుకున్నప్పటికి ఆ కథ తనకు సెట్టవ్వదని రామ్ చరణ్ కి అయితే కరెక్ట్ గా సెట్టవుతుందని.. ఆ విధంగా మహేష్ ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేస్తున్నారట. దీంతో RRR తరువాత మెగాహీరోతో అనిల్ చేయాలని అనుకున్న సినిమా ఉహించని విధంగా క్యాన్సిల్ అయ్యిందని సమాచారం.


Click it and Unblock the Notifications











