twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్‌కు గాయం.. RRR షూటింగ్ రద్దు... తిరుగుముఖం పట్టనున్న రాజమౌళి

    |

    రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్నమల్టీస్టారర్ మూవీ RRR. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ఉత్తరభారత దేశంలో శర వేగంగా జరుగుతోంది. అయితే అనుకోని విధంగా ఈ చిత్రానికి సంబంధించిన పూణె షెడ్యూల్ రద్దయింది.

    ఈ విషయాన్ని RRR టీమ్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఖరారు చేశారు. రామ్ చరణ్‌కు చిన్న గాయం కావడంతో షూటింగులో పాల్గొనే పరిస్థితి లేక పోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.

    రామ్ చరణ్‌‌‌కు మైనర్ ఇంజురీ, నడవలేని స్థితిలో

    రామ్ చరణ్‌‌‌కు మైనర్ ఇంజురీ, నడవలేని స్థితిలో

    రోజు వారీ వర్కౌట్లలో భాగంగా రామ్ చరణ్ జిమ్ చేస్తుండగా ఆంకిల్(చీలమండలం) ఇంజురీ అయింది. దీంతో చరణ్ సరిగా నడవలేని పరిస్థితి ఏర్పడిందని, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ రద్దు చేయక తప్పలేదు.

    మూడు వారాలు విశ్రాంతి అవసరమని చెప్పిన వైద్యులు

    మూడు వారాలు విశ్రాంతి అవసరమని చెప్పిన వైద్యులు

    ఈ మైనర్ ఇంజురీ నుంచి పూర్తిగా కోలుకోవడానికి రామ్ చరణ్‌కు దాదాపు 3 వారాల సమయం పడుతుందని వైద్యులు సూచించారు. పూణె షెడ్యూల్ మొత్తం కూడా రామ్ చరణ్ పైనే సీన్లు చిత్రీకరించాల్సి ఉండటంతో షూటింగ్ వాయిదా వేయక తప్పలేదు.

    అఫీషియల్‌గా ట్వీట్ చేసిన RRR టీమ్

    ‘ఈ విషయాన్ని చెప్పడానికి కాస్త బాధగా ఉంది. రామ్ చరణ్ జిమ్ చేస్తూండగా చీలమండలానికి గాయమైంది. దీంతో పుణె షెడ్యూల్ రద్దు చేశాం. 3 వారాల తర్వాత బ్యాక్ టు యాక్షన్' అంటూ RRR టీమ్ ట్వీట్ చేసింది. గాయపడ్డ రామ్ చరణ్‌కు అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించిన అనంతరం హైదరాబాద్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

    అభిమానుల ప్రేయర్స్

    అభిమానుల ప్రేయర్స్

    ఈ విషయం తెలిసిన వెంటనే రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రేయర్స్ చేస్తున్నారు. అయితే ఇది మైనర్ ఇంజురీ మాత్రమే కావడంతో ఎవరూ అందోళన పడాల్సిన అవసరం లేదని చిత్ర బృందం చెబుతోంది.

    RRR మూవీ

    RRR మూవీ

    రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగన్, బ్రిటిష్ బ్యూటీ డైసీ ఎడ్గర్ జోన్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ చరణ్, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య దాదాపు రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2020 జులైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    "We regret to mention that Ram Charan confronted a minor ankle injury while working out at the gym, yesterday. The pune schedule has been called off. Back to action in 3 weeks!" RRR team tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X