పాన్ ఇండియా దర్శకుడితో మరోసారి రామ్ చరణ్ చర్చలు.. ఒకేసారి రెండు కథలు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తర్వాత కూడా అదే తరహాలో సినిమాలు చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు ఒక్కసారి పాన్ ఇండియా సినిమాలను చూస్తే మళ్లీ ఆ తర్వాత కూడా అదే తరహాలో మార్కెట్ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఎక్కువగా అన్ని భాషల వారికి నచ్చే విధంగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.. ప్రస్తుతం RRR సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

సంక్రాంతి కానుకగా రాబోతున్న సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఆ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో చేస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

RC15 సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కూడా త్వరలోనే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అలాగే సినిమా టైటిల్ పై కూడా వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వాలని దర్శకుడు శంకర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఇటీవల గౌతమ్ తిన్ననూరి తో కూడా ఓ సినిమా చేసేందుకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. నిర్మాత అల్లు అరవింద్ సలహామేరకు గౌతమ్ చెప్పిన కథను విన్న రామ్ చరణ్ సింగిల్ సిట్టింగ్ లోనే ఆ కథను ఓకే చేశాడట.

Ram charan another story discussion with Pan india director

గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాతో మంచి దర్శకుడిగా గుర్తింపు పొందుతున్నాడు. ఇక అదే కథను ప్రస్తుతం షాహిద్ కపూర్ తో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్ తేజ్ ఎవరితో వర్క్ చేస్తాడు అనేది ఇంకా అఫీషియల్ గా వెలువడలేదు.

అయితే చరణ్ కోసం మాత్రం కొంత మంది అగ్ర దర్శకుల్లో ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. లిస్టులో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ అనిల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ఒకసారి ప్రశాంత్ నీల్ , రామ్ చరణ్ - మెగాస్టార్ చిరంజీవి ని ప్రత్యేకంగా కలుసుకున్నాడు అయితే అప్పుడు మాత్రం సినిమా చేస్తున్నట్లు క్లారిటీ కూడా ఇవ్వలేదు.. కానీ రెండు కథల పై మాత్రం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తేజ్ కోసం దర్శకుడు ప్రశాంత్ నీల్ మళ్లీ ఆ కథలలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్ అయితే దర్శకుడి పై నమ్మకంతో రెండు కథల పై కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయని అన్నాడట.

కానీ ఎక్కువగా ఒక యాక్షన్ స్టోరీ బాగా నచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు ఆ కాన్సెప్ట్ కూడా KGF తరహాలోనే ఉంటుందని ఎన్టీఆర్ సినిమా తర్వాత వీలైతే రామ్ చరణ్ తోనే చేసే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వస్తోంది. అలాగే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ప్రస్తుతం చేస్తున్న సలార్ సినిమాతో పాటు మరో సినిమా కూడా చేయాలని అనుకుంటున్నాడు. ఇక రామ్ చరణ్ సినిమా ఏ సంవత్సరం సెట్స్ పైకి వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X