సర్ ప్రైజ్ వచ్చేసింది.. ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. అదిరిపోయిన రామ్ చరణ్

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్బంగా ట్విట్టర్ మొత్తం హడలిపోయింది. ఓ వైపు అభిమానుల విషెస్‌తో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతూ వచ్చింది. మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, రాజమౌళి మాటల ట్వీట్లతో ఫుల్ ఫన్ క్రియేట్ అయింది. సోషల్ మీడియా మొత్తం వారి సందడే కనిపించింది. రామ్ చరణ్ బర్త్ డే సర్‌ప్రైజ్ గిఫ్ట్ అంటూ జరిగిన హంగామా ఏంటో ఓ సారి చూద్దాం.

Recommended Video

Bheem For Ramaraju - RRR| Ram Charan’s First Look Video On His Birthday
సర్ ప్రైజ్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్..

సర్ ప్రైజ్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్..

రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఉందని ఎన్టీఆర్ ట్వీట్ చేయడంతో రచ్చ మొదలైంది. రామరాజు కోసం భీమ్ అంటూ ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్‌ను ప్లాన్ చేశాడు ఎన్టీఆర్. ఈ మేరకు నేటి ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తానని, అది ఎప్పటికీ మరిచిపోలేని విధంగా ఉంటుందని అంచనాలు పెంచేశాడు ఎన్టీఆర్.

 ఆలస్యానికి కారణం ఆయనే..

ఆలస్యానికి కారణం ఆయనే..

అయితే రాత్రి జరిగిన వ్యవహారంతో ఈ గిఫ్ట్ తన నుంచి జారి రాజమౌళి చేతికి వెళ్లిపోయిందని, ఆయన చేతికి చిక్కితే ఎలా ఉంటుందో తెలిసిందే కదా.. క్షమించు రామ్ చరణ్ అది ఆలస్యం అవుతుందని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఏంటి ఆయనకు ఇచ్చావా? అసలు ఈ రోజు వస్తుందా? అంటూ రామ్ చరణ్ అసహనం వ్యక్తం చేశాడు.

చిరంజీవి-రాజమౌళి సంభాషణ..

ఈ సర్ ప్రైజ్ గిఫ్ట్‌లోకి చిరు ఎంట్రీ ఇచ్చాడు. తాను ఆ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను.. వెయిటింగ్ అంటూ తన డైలాగ్‌ను తానే ట్విట్టర్‌లో పోస్ట్ చేసి పది గంటలు ఎప్పుడవుతుందా? అని ఎదురుచూడసాగాడు. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఆలస్యం అవుతుండటంతో.. చిరును బుజ్జగించే ప్రయత్నం చేశాడు రాజమౌళి. సర్ సర్ అది అది కొంచెం కొంచెం.. యాక్చువల్‌గా ప్లీజ్ సర్ అంటూ తడుముకున్నాడు. దానికి రిప్లై ఇచ్చిన చిరు.. అర్థమైంది జక్కన్న గారూ అంటూ సెటైర్ వేశాడు.

చెప్పినట్టుగానే..

చెప్పినట్టుగానే..

అయితే తాను రాజమౌళితో చర్చించానని, సాయంత్రం నాలుగు గంటలకు ఆ గిఫ్ట్ కచ్చితంగా వస్తుందని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. చెప్పినట్టుగానే నాలుగు గంటలకు రిలీజ్ చేశారు. ‘కనబడితే నిప్పుకణం నిలబడినట్టు ఉంటది.... కలబడితే వేగు చుక్క ఎగబడినట్టు ఉంటది.. ఎదురుపడితే చావుకైనా చెమట దారపడతి....బాణమైనా బంధుకైనా బాంచన్ అంటంది. ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి నా అన్నం..మన్నెం దొర' అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌లో రిలీజ్ అయిన రామ్ చరణ్ లుక్ ఓ రేంజ్‌లో ఉంది. రామ్ చరణ్‌ను మరో లెవెల్‌లో చూపించేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X