వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా రామ్ చరణ్.. అదిరిపోయిన లుక్

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా రామ్ చరణ్.. అంటే అదేదో రాబోయే చిత్రం కోసమని కాదండి. ఓ మంచి పని కోసం ఫోటోగ్రాఫర్ అవతారమెత్తబోతోన్నాడు. అది కూడా ఆయన సతీమణి ఉపాసనతో కలిసి. ఈ ఇద్దరు కలిసి వన్యప్రాణుల సంరక్షణార్థం ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతోన్నారు. వీటికి సంబంధించిన రామ్ చరణ్ లుక్.. తాజాగా బయటకు వచ్చేసింది.

సామాజిక సేవలో..

సామాజిక సేవలో..

సామాజిక సేవ చేసేందుకు ఉపాసన ఎప్పుడూ ముందుంటుంది. ఆరోగ్య చిట్కాలను, ఆయుర్వేద పద్దతులను, రసాయనాలు లేని సహజ సిద్దమైన వంటల గురించి అవగాహన కలిగిస్తూ తన ఫాలోవర్స్‌ను చైతన్య పరుస్తూ ఉంటుంది. మొక్కలు, జంతువులు, పర్యావరణం, పక్షులంటూ ఆలోచిస్తూ ఉంటుంది.

ఆఫ్రికా టూర్ వేసిన దంపతులు..

ఆఫ్రికా టూర్ వేసిన దంపతులు..

ఆ మధ్య ఈ ఇద్దరు కలిసి ఆఫ్రికాలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను సందర్శించిన సంగతి తెలిసిందే.అక్కడి రకరకాలు జంతువులు, వాటిని పెంచే విధానం, సంరక్షించే పద్దతుల గురించి తెలుసుకున్నారు. వీరి ఆఫ్రికా టూర్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అత్యాధునిక హంగులతో..

రామ్ చరణ్-ఉపాసనల నివాసం కోసం ప్రత్యేకంగా ఓ ఇంటిని నిర్మించుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇంటీరియర్ డిజైన్ కోసం ప్రపంచ ప్రసిద్ది చెందిన వారితో అలంకరించేందుకు ప్లాన్ చేశారు. అత్యాధునిక హంగులతో నిర్మిస్తోన్న ఈ భవంతిలోకి త్వరలోనే ప్రవేశించబోతోన్నట్లు తెలుస్తోంది.

 వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్..

వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్..

ఈ కొత్త ఇంట్లోనే వరల్డ్ లైఫ్ ఫండ్ కోసం ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతోన్నారు. రామ్ చరణ్, ఉపాసన కలిసి హోస్ట్ చేసే ఈ ఈవెంట్‌ను వైల్డెస్ట్ డ్రీమ్స్ అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది. వారి నూతన గ‌ృహంలో ఈ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించబోతోన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X