మెగా-మంచు బంధం.. స్నేహం గురించి చెబుతూ.. చెర్రీపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్‌లోని మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవి-మోహన్ బాబు మధ్య ఉన్న స్నేహం, ప్రేమ, కోపం, వివాదాలు ఇలా అన్నీ అందరికీ తెలిసినా.. వారిద్దరి మధ్య తెలియన బంధం ఒకటి ఎప్పుడూ ఉంటూనే వస్తోంది. ఎన్ని గొడవలు జరిగినా, బహిరంగంగానే విమర్శించుకున్నా, కయ్యానికి కాలు దువ్వినా.. అవేవీ వారిద్దరి స్నేహబంధాన్ని ఇసుమంతైన నష్టంచేకూర్చలేకపోయింది. వీరిద్దరి లాగే ఇరు కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా ఉంటాయి.

ఒకే కుటుంబంలా..

ఒకే కుటుంబంలా..

మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ ఒకే కుటుంబంలో కలిసి ఉంటాయి. చిన్నప్పుడు తామంతా కలిసి ఎలా ఎంజాయ్ చేసేవారమో మంచు లక్ష్మీ రీసెంట్‌గా పూసగుచ్చినట్టుగా వివరించిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు, మనోజ్, తాను, శ్రీజ, సుష్మిత, చరణ్ ఇలా అంతా ఎంత సందడిగా గడిపే వాళ్లో చెప్పుకొచ్చింది.

షూటింగ్ సమయాల్లో..

షూటింగ్ సమయాల్లో..

ఒకానొక సమయంలో చిరంజీవి, మోహన్ బాబు కలిసి వరుసగా చిత్రాలు చేసేవారు. అప్పట్లో వీరి కాంబినేషన్‌కు అంత క్రేజ్ ఉండేది. ఇలా వీరిద్దరి సినిమాల షూటింగ్స్ ఔట్ డోర్‌లో ఇరు కుటుంబాలు కలిసి వెళ్లేవంటా.. అక్కడే వీరి హాలీడేలు కూడా గడిచేవంట..అలా రెండు కుటుంబాలు ఒక్కటయ్యాయని, అందుకే వారి పిల్లలమైన మేము ఇంత దగ్గరయ్యామని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.

ముహూర్తపు షాట్‌కు అతిథిగా..

మంచు మనోజ్ ప్రస్తుతం నటిస్తున్న అహం బ్రహ్మాస్మి మూవీ గురించి అందరికీ తెలిసిందే.తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ మూవీ రేపు (మార్చి 6) లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టేందుకు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతోన్నాడని మనోజ్ ప్రకటించాడు. ఈ మేరకు రామ్ చరణ్‌తో తనకున్న అనుబంధాన్ని పేర్కొన్నాడు.

Recommended Video

Manchu Manoj Posts Goes Viral In Social Media | Filmibeat Telugu
 రామ్ చరణ్‌పై మనోజ్ కామెంట్స్..

రామ్ చరణ్‌పై మనోజ్ కామెంట్స్..

‘ఓ ఫ్రెండ్ కష్టకాలాన్ని సులభంగా మార్చేస్తాడు.. మంచి రోజులను ఇంకాస్త మంచిగా మలుస్తాడు.. నా స్నేహితులందరికీ నేను మనస్ఫూర్తిగా విలువిస్తాను.. నా స్నేహితులకు, కుటుంబానికి నేను చేయగలిగినదంతా చేయడానికి ప్రయత్నిస్తాను.. అలాంటి వాళ్లందరిలోంచి.. ఓ నిజమైన స్నేహితుడు రామ్ చరణ్ కుటుంబ సభ్యుడిగా మారిపోయాడ'ని పోస్ట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X