మహేష్ బాబు అల్లుడి కోసం రామ్ చరణ్.. గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోన్న సినిమా

సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. ఇప్పటికే నరేష్ కుమారుడు నవీన్ ఎంట్రీగా ఇచ్చినా అంతగా ఫామ్‌లోకి రాలేకపోయాడు. ఇక మరో హీరో సూపర్ స్టార్ ఫ్యామిలీ ట్యాగ్‌తో ఎంట్రీ ఇవ్వనున్నాడు. మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతోన్నాడు. గతంలోనే గల్లా అశోక్ హీరోగా ఓ చిత్రం కూడా ప్రారంబంకావాల్సి ఉండగా.. మధ్యలోనే ప్రాజెక్ట్ అటకెక్కేసింది. అయితే తాజాగా గల్లా అశోక్ ఎంట్రీపై అధికారిక ప్రకటన చేసేశారు.

గల్లా అశోక్ చేయబోయే మొదటి చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు రేపు(అక్టోబర్ 10) జరగబోతోన్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు ప్రకటించారు. రామ్ చరణ్‌ను ఆహ్వానింది.. సినిమా ప్రారంభోత్సవం నాడే హైప్ క్రియేట్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.

 Ram Charan Attends Galla Ashok Movie Opening Ceremony

అయితే ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తాడా? లేదా? అన్నది అనుమానమే. ఎందుకంటే సరిలేరు నీకెవ్వరు చిత్రషూటింగ్‌లో భాగంగా కేరళలో ఉన్న మహేష్..రేపటి ఈవెంట్‌కు హాజరవుతాడా? అన్నది తెలియలేదు. అయితే ఈ కార్యక్రమానికి దిల్ రాజు, వీకే నరేష్, సూపర్ స్టార్ కృష్ణ హాజరవుతారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X