రామ్ చరణ్ తో బాక్సింగ్ మూవీ.. డైరెక్టర్ ఓపెన్ కామెంట్స్.. ఎవరంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం తర్వాత చెర్రీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతటి సెన్సేషన్ గా మారారో తెలిసిందే. తన సినిమాల లైనప్ తో ప్రస్తుతం హీట్ ఎక్కిస్తున్నారు. చివరిగా తమిళ దర్శకుడు ఎస్ శంకర్ డైరెక్ట్ చేసిన 'గేమ్ ఛేంజర్'తో ప్రేక్షకుల ముందుక వచ్చారు. అయితే ఆ సినిమాలో అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చిన ఎందుకు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. సినిమా సందేశాత్మకంగా ఉన్నా ప్రశంసలు అందుకోలేదు. దీంతో చెర్రీ నెక్ట్స్ రాబోయే చిత్రాలపై మరింత శ్రద్ధ వహించారు.

నెక్ట్స్ 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి 'పెద్ది' అనే మాస్ టైటిల్ ను కూడా ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Ram Charan Boxing movie with director Harish Shankar

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లైనప్ లో నెక్ట్స్ మరోసారి సుకుమార్ డైరెక్షన్ ఉండనుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో 'రంగస్థలం' అనే చిత్రం వచ్చి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మరోసారి ఆర్సీ17గా కనీవిని ఎరుగుని సబ్జెక్ట్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ రామ్ చరణ్ తో సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ తో సినిమా తీస్తే మాత్రం బాక్సింగ్ సినిమా చేస్తానని చెప్పారు.

తమిళ చిత్రం 'జింఖానా' బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లోనే రూపుదిద్దుకుంది. ఏప్రిల్ 25న గ్రాండ్ గా తమిళంతో పాటు తెలుగులో భాషలోనూ విడుదల కాబోతోంది. తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ హాజరై ఆసక్తికరంగా మాట్లాడారు. ఇది బాక్సాఫీస్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాగా తెలుస్తోంది. సినిమాకు మంచి ఆదరణ దక్కుతుంది. నేను బాక్సింగ్ సినిమా చేస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో చేస్తాను. ఇక తెలుగు సినిమాలను అదరించినట్టుగానే జింఖానా సినిమాను కూడా ఆదరించండి.. అని చెప్పారు.

ప్రస్తుతం హరీశ్ శంకర్ పవర్ స్టార్, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఆ సినిమా అంతకంతూ ఆలస్యమవుతూనే వస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డేట్స్ ఖాళీ లేకపోవడంతో మరింతగా ఆలస్యమవుతుందని అంటున్నారు. వీరి కాంబోలో 2012లో గబ్బర్ సింగ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలో ఆడియెన్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X